రాష్ట్రీయం

స్కంధమాతగా బాసర అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, అక్టోబర్ 14: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి గోదారమ్మకు పూజలుచేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలోని అమ్మవార్ల దర్శనానికి రెండు గంటల సమయం పట్టడంతో క్యూలైన్‌లో వున్న చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యేక, సాధారణ అక్షరాభ్యాసం మండపంలో చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షర శ్రీకార పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవార్లకు విశేష పూజలు, ప్రత్యేక అర్చనలు, ఛండీహోమం పూజలను వేద మంత్రోచ్చరణలతో ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఐదవ రోజు అమ్మవారు స్కంధమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి మహా హారతి అనంతరం పెరుగు అన్నం నివేదన సమర్పించారు. అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారి అన్నదాన సత్రంలో భక్తులు అమ్మవారి ప్రసాదం స్వీకరించారు.
ఆదివారం ఆర్జిత సేవలు, ప్రసాదాల అమ్మకాల ద్వారా 8 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

నేడు మూల నక్షత్ర పూజ
శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూల నక్షత్ర పూజను నిర్వహిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూల సందర్భంగా అమ్మవారి చెంత అక్షరాభ్యాస పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈ మూలనక్షత్రం పూజకు భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్ ఏర్పటుచేశారు. చిన్నారులకు ఉచితంగా పాటు, బిస్కెట్‌లు పంపిణీ చేయనున్నట్లు ఆలయ ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 5 గంటల నుండి అక్షర స్వీకార పూజలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.