రాష్ట్రీయం

అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: అన్నం పరబ్రహ్మ స్వరూపం, సర్వజీవులకు ప్రాణాధారం, సృష్టిలోని ప్రాణులకు అన్న ప్రసాదాలను అందించే నిత్యాన్నదానేశ్వరిగా పూజలందుకునే శ్రీ అన్నపూర్ణాదేవిగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో సోమవారం బెజవాడ కనకదుర్గమ్మ భక్తకోటికి దర్శనమిచ్చింది. వర్షంలోనూ భక్తులు అధిక సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు దీరారు. మరో వైపు మహామండపంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక కుంకుమార్చనలు జరిగాయి. యాగశాలలో రుత్విక్కులు శతచండీ హోమం నిర్వహించారు. అర్చకులు శ్రీ చక్రార్చన, శాంతి కళ్యాణం, అష్టోత్తరం, సహస్రనామార్చానలు నిర్వహించారు. ఇలా మొత్తంపై వేదమంత్రాల ఘోష పర్వతరాజంపై ప్రతిధ్వనించింది. ఇంద్రకీల గిరులు నిత్యం ‘ఓం కనకదుర్గాయనమః’ నామస్మరణతో పులకించిపోతున్నాయి. భక్తుల రద్దీ ఎలా ఉన్నప్పటికీ ఆలయ ఈవో కోటేశ్వరమ్మ.. ఉచిత దర్శనం క్యూలైన్లను ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా భక్తులు దుర్గమ్మను దర్శించుకునే తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇచ్చింది పడకుండా కొండపైకి తీసుకెళ్లి వారిచే దుర్గమ్మ దర్శనం చేయించారు. ఇలాఉంటే మూలానక్షత్రం రోజున ఆదివారం రికార్డు స్థాయిలో 4.15 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. తొలి ఐదు రోజుల్లో మొత్తంపై 9.50 లక్షల మంది దర్శించుకున్నారు. అలాగే 4వేల మంది దివ్యాంగులు, వృద్ధులను భవానీ సేవాదళ కార్యకర్తలు దగ్గరుండి దర్శనం చేయించారు. గత రాత్రి హైదరాబాద్ పఠాన్ చెరువు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు యడ్ల రమేష్ రూ. 2.12 లక్షల విలువైన బంగారు ఆభరణం, ఇదే విధంగా హైదరాబాద్‌కు చెందిన వీవీ రెడ్డి 40 గ్రాముల, 900 మీ. గ్రాముల తూకంతో తయారు చేయించిన మూడు పసిడి ఆభరణాలను ఈవో కోటేశ్వరమ్మ ద్వారా అమ్మవారికి సమర్పించారు. 16 గ్రాముల 300 మిల్లీ గ్రాముల ఖడ్గం, ముక్కుపుడక, కత్తి తదితర పసిడి ఆభరణాలు ఈ జాబితాలో ఉన్నాయి.