రాష్ట్రీయం

అనంత సంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నిన్న పవిత్రసంగమం, నేడు మహాసంగమం, రేపు అనంత సంగమం, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలదీక్షలో మరో ముందడుగు. గోదావరి-కృష్ణమ్మలను కలపడమే కాకుండా, వంశధార నుంచి పెన్నా సహా రాష్ట్రంలోని పంచనదుల సంగమాన్ని చేపట్టి చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి నదులను రిజర్వాయర్లుగా మలిచే మహత్తర యజ్ఞానికి తెరతీశారు. చెరువులు-చెక్‌డ్యాంలు-ప్రాజెక్టులు-ఇతర జలవనరులను నదులతో అనుసంధానించే ‘అనంత సంగమం’కు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 25.58 శాతం లోటు వర్షపాతం నమోదైందని, భవిష్యత్‌లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని జలవనరుల అనుసంధానం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా భూమిపైనా, భూగార్భంలోనా జలవనరులు భద్రపరుచుకునే అవకాశం కలుగుతుందన్నారు. పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ఉండవల్లిలోని ‘ప్రజా వేదిక’లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిర్దేశిత లక్ష్యాల మేరకు అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. ప్రాధాన్య
ప్రాజెక్టులు అనుకున్న సమయానికి నిర్మించడంతో పాటు, సూక్ష్మ సేద్యం లక్ష్యాలపైనా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రాధాన్య ప్రాజెక్టుల విషయంలో సమర్థవంతంగా పనిచేసి పురోగతి కనబరిచిన కడప జలవనరుల శాఖ సీఈ, ఇతర అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
హీరమండలం రిజర్వాయర్ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన హైలెవల్ కెనాల్ నిర్మాణంతో వంశధార-బహుదా అనుసంధానం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, ‘మూలపల్లి’ సంక్రాంతి నాటికి సిద్ధమవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి-పెన్నా అనుసంధానం ఫేజ్ 1 టెండర్ల ప్రక్రియ చివరిదశకు వచ్చిందన్నారు. ప్రాధాన్య ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన అన్ని అనుమతులను అటవీ శాఖ త్వరితగతిని ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
పెదపాలెం ఎత్తిపోతల పథకం, కెఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్, గండికోట రిజర్వాయర్, కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మొత్తం 61 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టగా ఇప్పటికే 15 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 26 ప్రాజెక్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. 16 ప్రాజెక్టులను కొత్తగా చేపడుతున్నారు.

వచ్చే వారానికి పోలవరం జెట్ గ్రౌటింగ్ పూర్తి
పోలవరం ప్రాజెక్టుపై 78వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రికి వచ్చే వారానికి జెట్ గ్రౌటింగ్ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు వివరించారు. కాఫర్ డ్యాంలో భాగమైన జెట్ గ్రౌటింగ్ పనులు ఇప్పటికే 96.90 శాతం అయ్యాయని, మిగిలిన పనులు వారం రోజుల్లో పూర్తిచేసి మరో మైలురాయిని చేరుకుంటామని వెల్లడించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 59.32 శాతం పూర్తికాగా, తవ్వకం పనులు 79 శాతం, కాంక్రీట్ పనులు 41.50 శాతం పూర్తయినట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ 64.28 శాతం, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.88 శాతం పూర్తయినట్టు తెలిపారు. గత వారం స్పిల్ చానల్, స్పిల్ వే, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెప్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.52 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 47వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పునరావసం, పరిహారం విషయంలో వేగం పెంచాలని, కాలనీలలో వౌలిక వసతులు కల్పన పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి మించి నిర్వాసితులకు మనం సాయం అందిస్తున్నామని, వారిలో అసంతృప్తి తలెత్తకుండా చూడాలని సూచించారు. ఆర్‌ఆర్ ప్యాకేజ్ సాఫీగా అందనివ్వకుండా ఎవరైనా అడ్డుపడి కుట్రలు చేస్తే సహించవద్దని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో భూసేకరణ పూర్తికాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 55,858.6 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

చిత్రం..పోలవరం, ఇతర ప్రాజెక్ట్‌లపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు