రాష్ట్రీయం

ఏపీలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కొక్క పాస్‌బుక్ మీద రూ. 2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడంతోపాటు ఒక్కొక్క కనెక్షన్ మీద ఏడాదికి నాలుగు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసీరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రరత్నభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ, రాష్ట్రంలో అధికార పార్టీగా టీడీపీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటగా, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. జనానికి అచ్చేదిన్ బదులు చచ్చేదిన్‌లు దాపురించాయని తులసీరెడ్డి అన్నారు. అవినీతి, అసమర్థత, అప్పులు, అడంబరాలతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ఒక శనిగ్రహంగా, చంద్రబాబు రాహువుగా, జగన్ కేతువుగా దాపురించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలు అమలు, ఉక్కు కర్మాగారంతోపాటు, వ్యవసాయ రుణాల మాఫీ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయడం, డ్వాక్రా సంఘాలకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తుందని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందని తులసిరెడ్డి అన్నారు.