రాష్ట్రీయం

కృష్ణా జలాలపై తేలని వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం మొక్కుబడిగానే సాగింది.. నీటి వాటాలపై ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. కనీసం వచ్చే ఏడాదైనా కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా ఎంతో కచ్చితంగా తేల్చాలని రెండు రాష్ట్రాలు బోర్డును డిమాండ్ చేసాయి. కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ శ్రీవాస్తవ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో సమావేశమైంది. తెలంగాణ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, తెలంగాణ ఇఎన్‌సీ మురళీధర్, ఆంధ్ర ఇఎన్‌సీ వెంకటేశ్వర్‌రావుతో తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. బోర్డు సమావేశంలో ఎప్పటి మాదిరిగానే కృష్ణా జలాలను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటోందని తెలంగాణ, కాదు.. తెలంగాణాయే ఎక్కువ వాడుకుంటోందని ఆంధ్ర అధికారులు పరస్పర ఆరోపించారు. కృష్ణానదీలో టెలిమెట్రీలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఎవరెంత వాడుకుంటున్నారో కచ్చితమైన లెక్క తేలడం లేదని రెండు రాష్ట్రాల అధికారులు అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు కోరగా, నీటి వాటాలు తేల్చేవరకు కీలకమైన నిర్ణయాలు
ఏవీ తీసుకోవద్దని తెలంగాణ అధికారులు సూచించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వాడుకుంటుందని తెలంగాణ ఆరోపించగా, శ్రీశైలం ఎడమగట్టు ద్వారా తెలంగాణ ఇప్పటికే ఎక్కువ నీటిని వాడుకుందని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆరోపించారు. ఇరు రాష్ట్రాల వాదనలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని, నీటి వాటాలు తేలితే తప్ప దీనికి పరిష్కారం లభించదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. అలాగే వచ్చే ఏడాదైనా టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలు కోరాయి. వచ్చే ఏడాది కృష్ణాలో నీటి వాటాలు తేల్చేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం కావాలని నిర్ణయించి సమావేశాన్ని వాయిదా వేశారు.
చిత్రం..హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం సమావేశమైన కృష్ణానదీ యాజమాన్య బోర్డు