రాష్ట్రీయం

కేసీఆర్ డబుల్ ధమాకా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ వర్గాలకు బంపర్ తాయిలాలను ప్రకటించింది. దసరా తర్వాత విడుదల చేయనున్న పూర్తిస్థాయి మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ తెలంగాణ భవన్‌లో సమావేశమైంది. గతంలో ప్రకటించిన వరాలకు అదనంగా ఈసారి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు భృతిని చేర్చడం విశేషం. గతంలో మాదిరిగానే ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల పంట రుణాన్ని మాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. రుణ మాఫీ అమలులో గతంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావడంతో ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అయితే రుణ మాఫీని ఒకే దఫా చేస్తారా, విడతల వారీగా చేస్తారా? అనే అంశంపై సీఎం స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై పూర్తిస్థాయి మేనిఫెస్టోలో పేర్కొంటామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతిని ఇస్తామని ప్రకటించారు. కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 11 లక్షల మంది నిరుద్యోగులున్నారని, నిరుద్యోగి అనే పదాన్ని ఎలా నిర్వచించాలి, ఎవరికి ఎంతెంత ఇవ్వాలనే దానిపై అధ్యాయనం చేస్తామన్నారు. ఆసరా పథకం కింద ప్రస్తుతం 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, గతంలో వృద్ధాప్య పెన్షన్ పొందడానికి 65 ఏళ్ల
వయో పరిమితిని అర్హతగా నిర్ణయించగా, ఈసారి దానిని 57 ఏళ్ళకు కుదిస్తున్నట్టు సీఎం వివరించారు. ఈ నిర్ణయంతో పెన్షన్లు పొందనున్న వారి సంఖ్య మరో 8 లక్షలు పెరగుతుందని అంచనా వేస్తున్నమన్నారు. అలాగే గతంలో వృద్ధులు, వితంతువులు ఇతరులకు రూ.1000 పెన్షన్ చెల్లిస్తుండగా దీనిని రూ.2016 పెంచుతామన్నారు. వికలాంగులకు ఇస్తున్న రూ.1500ను రూ.3016కు పెంచుతామన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని మరింత విస్తరిస్తున్నామని, సొంతంగా స్థలం కలిగి ఉంటే వారికి కూడా డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణానికయ్యే మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. అలాగే ఇప్పటికే ఇళ్లు ఉన్న పేదలు దానిని మరింత విస్తరించేందుకునేందుకు ముందుకువస్తే వారికి కూడా రూ.3 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. అగ్రకులాలకు చెందినవారిలో కూడా పేదలున్నారని, వారికి కూడా సంక్షేమ ఫలాలు కావాలని కోరుతున్నారని అన్నారు. వీరినుంచి వచ్చిన డిమాండ్ మేరకు రెడ్డి, వైశ్య సామాజిక వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్పొరేషన్లకు ప్రభుత్వపరంగా కొంత కార్పస్ ఫండ్ అందజేస్తామని, దీనిని ఏ విధంగా వినియోగించుకుంటారో అదే సామాజిక వర్గానికి చెందిన మేధావులకు అప్పగించి విధి విధానాలు రూపొందిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు. ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగులకు పీఆర్‌సీని ప్రకటించలేకపోయామని, దీనికి వారేమీ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, తిరిగి అధికారంలోకి వచ్చేది తామే కనుక మంచి ఫిట్‌మెంట్‌నే ప్రకటిస్తామని అన్నారు. అలాగే ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, హోంగార్డులకు దేశంలో మరే రాష్ట్రంలో లేనంత ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని, తిరిగి అధికారంలోకి వచ్చాక మళ్లీ పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాము ప్రకటించిన దానికంటే ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ ప్రకటించినా వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వేటినీకూడా కాంగ్రెస్ అమలు చేయలేదని కేసీఆర్ గుర్తుచేశారు. ఎవరెన్ని హామీలు గుప్పించినా తాము ఇచ్చేది మాత్రం ఇంతేననని కేసీఆర్ స్పష్టం చేసారు.

చిత్రం..తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను వెల్లడిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు