రాష్ట్రీయం

మక్కీకి మక్కీ కాపీ కొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ‘మా మేనిఫెస్టోను మక్కికీ-మక్కీ కాపీ కొట్టారు..’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుపై విరుచుకుపడ్డారు. తాము ప్రకటించిన హామీలను కేటీఆర్ తప్పుపట్టారని, అవి అమలు చేసేందుకు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని అన్నారని ఉత్తమ్ గుర్తుచేశారు. కేటీఆర్ ఇచ్చిన హామీలకు ఆయన ఇప్పుడు ఏమని సమాధానమిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ అబద్ధపు మాటలు ప్రజల్లోకి పోవద్దన్న ఉద్దేశంతో అత్యవసరంగా విలేఖరుల సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఉత్తమ్ పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మళ్లీ కొత్త హామీలా? అని ప్రశ్నించారు. ఐఆర్ ఇవ్వనందుకు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏమీ సాధించారని ప్రశ్నించారు. పెన్షన్ మూడు, నాలుగు నెలలకు ఇస్తున్నారని, ఒకేసారి రుణ మాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, కేసీఆర్ మోసం చేస్తున్నారని ప్రజలకు తెలిసిందని అన్నారు. తాము
అధికారంలోకి రాగానే డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల గ్రాంటు ఇస్తామని, మహిళలకు 10 లక్షల చొప్పున రుణాలు ఇప్పించి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
అభయ హస్తం పునరుద్ధరిస్తాం
మహిళలకు అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని, బీపీఎల్ కుటుంబాలకు 5 లక్షల వరకు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు. ప్రమాద భీమా 5 లక్షలు ఇస్తామని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బీపీఎల్ కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ ఏడు కిలోల సన్న బియ్యంతోపాటు 9 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇస్తామని ఉత్తమ్ తెలిపారు.
దళితులకు, గిరిజనులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. మూడెకరాలు ఇస్తామన్న హామీ నెరవేర్చనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పలేదని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదని అన్నారు.
ఉచితంగా 6 సిలెండర్లు
బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని ఉత్తమ్ తెలిపారు. దళితుల నివాసాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఎస్సీ, ఎస్టీలను నిరంతరం మోసం చేశారని విమర్శించారు.
దళిత సీఎం హామీ ఏమైంది?
టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే దళితుడ్ని చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇది దళితులను మోసం చేయడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 64 లక్షల మంది వున్న దళితుల్లో కేవలం 3 వేల కుటుంబాలకు 3 ఎకరాలు చొప్పున ఇచ్చారని ఆయన తెలిపారు.
అన్నీ అబద్దాలే
40 లక్షల గిరిజన కుటుంబాల్లో ఒక్క కటుంబానికీ భూమి ఇవ్వలేదని, పైగా పోడు భూములను లాక్కునే ప్రయత్నం చేశారని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేశారని, మహిళా సంఘాలను, విద్యార్థులను మోసం చేశారని, రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్నీ పరామర్శించలేదని ఉత్తమ్ విమర్శించారు.