రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అవుతుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 20న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు రానున్నారు. తొలుత ఆయన చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్రలో పాల్గొంటారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్‌సీ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు ప్రభృతులు మంగళవారం చార్మినార్‌ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పరోక్షంగా కలిసి ఉంటున్న టీఆర్‌ఎస్‌తో మజ్లీస్ దోస్తీ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మైనారిటీల సంక్షేమమే తమ పార్టీ ధ్యేయమని, కుల, మతాలకు అతీతంగా రాజీవ్ సద్భావనా యాత్ర 1990
నుంచి కొనసాగుతోందని తెలిపారు. రాజీవ్ సద్భావనా అవార్డును ఈ ఏడాది మాజీ ముఖ్యమంత్రి కే.రోశయ్యకు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల్లో పాతనగరంలో మూడు సీట్లలో తమ పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సద్భావనా యాత్రను రాహుల్ ప్రారంభించిన అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, హెలికాప్టర్‌లో భైంసాకు వెళతామని ఆయన తెలిపారు. అక్కడ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారని ఆయన చెప్పారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డి చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, రాత్రికి ఢిల్లీకి వెళతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
వనపర్తి సభలో అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తూ కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు అని కించపరిచారని పీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్ ముతినేని వీరయ్య మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. వికలాంగుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ అంశంపై హెచ్‌ఆర్‌సి ఎస్‌ఆర్ నెం.7643/18 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం..రాజీవ్ సద్భావనా యాత్ర ఏర్పాట్లలో భాగంగా మంగళవారం చార్మినార్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు