రాష్ట్రీయం

ఓటుకు నోటులో ఇరుక్కున్నా.. బాబుకు బుద్ధిరాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: కాంగ్రెస్ నాయకుల అవినీతిపై పక్కా ఆధారాలున్నా తాము ఇప్పటి వరకు ఎవర్ని ఏమనే్లదని, ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చాక మాత్రం ఎవర్ని వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘నీకు దున్నుకోవడానికి పొలం లేదా? ఇక్కడికొచ్చి దున్నుతావా’ అని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రబిడ్డలు తాము ఇక్కడి వారమేనన్న భావన పెంచుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం వస్తే ఆంధ్రవాళ్లకు ఏమో అవుతుందన్న లేనిపోని దుష్ప్రచారం జరిగింది, మరీ రాష్ట్రం వచ్చాక ఏమైనా జరిగిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వంటి వారి వల్లనే సమస్యలు వస్తున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రవాళ్లకు చంద్రబాబు శనిలా దాపురించారన్నారు. టీడీపీ హయాంలో హైదరాబాద్‌లో చిటికి మాటికి కర్ఫ్యూలు ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి వస్తే ఏమో అయిపోతుందన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఎవరు ప్రచారానికి వస్తారో తెలియకుండానే నిర్ణయం తీసుకున్నామా అని ప్రశ్నించారు. ‘ఈ కేసీఆర్ గట్స్ ఉన్నోడు’ ఎవరికి భయపడరన్నారు. వంద సీట్లు గెవలడం కాదు, వంద ఆరు, వంద ఏడు సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. నూటికి నూరుపాళ్లు తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. డిసెంబర్‌లో చూస్తారు కదా ఎవడెవడు గడ్డం గీసుకుంటాడో, గుండ్లు చేయించుకుంటారోనని కేసీఆర్ ఎద్దేవా చేసారు.
రాములు నాయకే కాదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవర్ని సహించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు.

చిత్రం..తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్