రాష్ట్రీయం

‘పోలవరం’ నిర్మాణంలో మరుగునపడిన కీలక పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సులో భాగంగా డిజైన్ చేసిన కొన్ని కీలకమైన పనుల ప్యాకేజీలు మరుగున పడ్డాయి. నేవిగేషన్ చానల్స్, ట్విన్ టనె్నల్స్ సకాలంలో పూర్తయితేనే లక్ష్యం మేరకు నీరందించడానికి అవకాశంవుంది. ఎంతసేపూ స్పిల్, స్పిల్ ఛానల్, గేట్లు, కాఫర్ డ్యామ్‌లే తప్ప అనుబంధ ట్విన్ ఛానల్స్, నేవిగేషన్ లాక్స్, నేవిగేషన్ ఛానల్స్ పనులను మర్చిపోయారు. ఈ ప్యాకేజీల్లో కొన్ని రీటెండర్లు పిలిచారు. అవి ఎంతవరకు మొదలయ్యాయో కూడా తెలియని గందరగోళం నెలకొంది. వాస్తవానికి హెడ్ వర్క్సులో ప్రధానమైన పనులకుతోడు నేవిగేషన్ చానల్స్, నేవిగేషన్ లాక్‌లు, ట్విన్ చానల్స్ పనులు పూర్తయితే తప్ప లక్ష్యం మేరకు 2019 నాటికి నీరందించలేని పరిస్థితి.
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సులో ప్యాకేజీ 67లో ఎడమ వైపు కనెక్టవిటీల్లో మూడు నేవిగేషన్ లాక్‌లు, నేవిగేషన్ కెనాల్, కెనాల్ సైఫాన్ పనులు చేపట్టారు. దీనికి అదనపు పనిగా ఫ్లడ్ గేట్ నిర్మాణం, దిగువ వరద గట్టుకు అనుసంధానంగా మూడవ లాక్ నిర్మాణ పనులు నిర్ధేశించారు. ఈ పనులను రెండేళ్ల కాలపరిమితిలో పూర్తిచేసే ఒప్పందంతో రూ.86.79 కోట్ల అంచనా విలువతో ప్రాథమికంగా పనులు చేపట్టారు. జాయింట్ వెంచర్‌లో హైదరాబాద్ యల్లారెడ్డిగూడాకు చెందిన సంస్థ ఈ పనులు చేపట్టింది. అయితే ఈ పనులు 96 శాతం వరకు పూర్తయినట్టు చూపించారు. గత మార్చి నాటికి దాదాపు రూ.80 కోట్ల విలువైన పనులు పూర్తిచేసినట్టు చెప్తున్నారు. ఈ పనులకు అనుబంధంగా ఉన్న ట్విన్ ఛానల్స్ పనులు మాత్రం అంతంత మాత్రంగానే పూర్తయ్యాయి. కుడి, ఎడమ గట్ల వైపు నిర్మిస్తున్న ఈ ట్విన్ ఛానల్స్ పనులు కేవలం 35 నుంచి 40 శాతం వరకే పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తయితే తప్ప కనెక్టవిటీలు పూర్తయినట్టు కాదు. ఈ మొత్తం పనులు సకాలంలో పూర్తయితేనే 2019 నాటికి లక్ష్యం మేరకు నీటి సరఫరా జరగనుంది. మొత్తంగా హెడ్ వర్క్సు పనులన్నీ పూర్తయినప్పటికీ హైవే క్రాసింగ్ వంతెనలు పూర్తికాకుండా ఎడమ కాలువ నీటిని విశాఖ వరకు తీసుకెళ్ళే అవకాశం కన్పించడంలేదు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సివుందని నిపుణులు పేర్కొంటున్నారు.