రాష్ట్రీయం

అభివృద్ధి దిశగా సాగాలని కోరుకున్నా: కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మవారి దర్శనానంతరం డాక్టర్ కోడెల మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం బాలారిష్టాలు దాటి అభివృద్ధి దిశగా సాగాలని దుర్గమ్మను కోరుకున్నానని అన్నారు. శ్రీ కాకుళం జిల్లాలో తుపాను కారణంగా ఇక్కట్లు పడుతున్న ప్రజలు ఆదుకునేందుకే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఆశీస్సులు అందించాలని కూడా కోరుకున్నానన్నారు. పాత్రికేయుల కోరికపై అనంత శ్రీరామ్ సరస్వతీదేవి పాటనుపాడి విన్పించారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీబడ్డారు. శ్రీ మల్లికార్జున మహామండపం కళావేదికపై జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి.
వేదఘోషతో పులకించిన ఇంద్రకీలాద్రి
దసరా శరన్నవరాత్రుల్లో ఎనిమిది రోజైన బుధవారం ఇంద్రకీలాద్రి మల్లికార్జున మహా మండపంలో జరిగిన వేద విద్వత్ సభ అమ్మవారి సన్నిధిని పులకరింప చేసింది. ప్రవాసాంధ్రులు అందించిన విరాళంపై వచ్చే వడ్డీతో పండితులను నగదు పారితోషకాలు, శాలువాలతో ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు.
నేడు తెప్పోత్సవం
దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున గురువారం శ్రీకనకదుర్గా దేవికి కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. తెప్పోత్సవంగా పిలిచే హంస వాహన సేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ గంగా పార్వతీ (దుర్గ) సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్ల చేత మూడు ప్రదక్షణాలు జల విహారం చేయిస్తారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు బుధవారం సాయంత్రం కమిటీ చైర్మన్ గౌరంగబాబు, ఈవో వీ కోటేశ్వరమ్మ ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ బీ లక్ష్మీకాంతంతో సమీక్ష జరిపారు.

స్వర్ణరథంపై వేంకటాద్రీశుడు
తిరుపతి, అక్టోబర్ 17: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారు బంగారురథంలో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోనూ, భజనబృందాల కోలాహలం, మంగళవాయిద్యాల నడుమ తిరుమాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు. శ్రీవారికి శ్రీదేవిభూదేవి ఇరుపక్కలా ఉంటారు. శ్రీదేవి (లక్ష్మి), సువర్ణమయి. ఆమె బంగారు కాగా- ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి. ఇంట పాత్రలు బంగారువి. సింహాసనం బంగారుది. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమంటే బాగా ప్రకాశించేది అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమినుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి స్వర్ణరథంలో ఊరేగడం, స్వామివారి మహోన్నతినీ, సారభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తుంది.
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ భూదేవి కరుణతో, సమస్త్ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల నమ్మిక. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ధర్మకర్తల మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు, ఇన్‌చార్జ్ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యభక్తులకు పెద్ద పీట వేశామని ఆలయ డిప్యూటీ ఇఓ హరీంద్రనాధ్ మీడియాకు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఇప్పటివరకు 6.54 లక్షల మందికి సంతృప్తికర దర్శనం కల్పించామని ఆయన వివరించారు. 300 టిక్కెట్లు, విఐపి దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించామన్నారు. ఇదిలావుండగా బ్రహ్మోత్సవాల్లో ఇప్పటివరకు శ్రీవారి హుండీ ద్వారా ఏడురోజులకు రూ. 16.14 కోట్లు లభించిందని పరకామణి డిప్యూటీ ఈ ఓ వి.దామోదరం మీడియాకు వివరించారు.