రాష్ట్రీయం

పైసా ఇవ్వని కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒడ్డున ఉండి రాళ్లు రువ్వుతున్న పవన్ * సానుభూతి చూపని టీఆర్‌ఎస్
* జగన్ మరో నాలుగేళ్లు నడిచినా ఫలితం ఉండదు
* వచ్చే ఎన్నికల్లో గెలుపే మన విజన్ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

అమరావతి, అక్టోబర్ 19: రాష్ట్రంలో ప్రకృతి విలయ తాండవంచేసి ఉత్తరాంధ్ర ప్రజలు వీధిన పడితే ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. శుక్రవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీల నేతలు పాల్గొన్న టెలీకాన్ఫరెన్స్‌లోవచ్చే ఎన్నికల్లో మార్గదర్శకాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల నమోదు, కౌన్సిల్ ఎన్నికలు, బూత్ కన్వీనర్లకు శిక్షణ, గ్రామ వికాసం పురోగతిపై సమీక్షించారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు కనీసం కేంద్రంలోని బీజేపీ నేతలు పర్యటించలేదన్నారు. బాధితులపై ఒక్క సానుభూతి మాట కూడా లేదన్నారు. తక్షణ సాయం అందించలేదని ఆరోపించారు. వైసీపీ రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టిస్తోంది.. జనసేన అధినేత పవన్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నారు.. కేటీఆర్ వేరే రాష్ట్రం నుంచి పవన్‌ను అభినందిస్తున్నాడు.. రాజమండ్రి కవాతును ప్రశంసిస్తాడు.. తిత్లీ బాధితులపై కనీస సానుభూతిలేదు.. వీళ్లంతా కలసి పనిచేస్తున్నారనటానికి ఇదే నిదర్శనమన్నారు. బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్, జనసేన నలుగురూ కలిసి టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం కోసం మనం పోరాడుతున్నాం.. ప్రత్యర్థి పార్టీలు మనపై పోరాటం చేస్తున్నాయి.. ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు..అది చూసి అక్కసు పెంచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలకు టీడీపీని దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 76 శాతం సంతృప్తి ఉంది.. మళ్లీ మీరే రావాలని సామాన్యులు, నిరుపేదలు నినాదాలు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదన్నారు. అతని ఫ్యాక్షన్ మనస్తత్వమే ఇందుకు కారణమన్నారు. చిత్తశుద్ధితో పాదయాత్ర చేయటంలేదు.. అదంతా ఓ డ్రామాగా సాగుతోందని ఎద్దేవా చేశారు. ఇలాగే మరో నాలుగేళ్లు నడిచినా ఫలితం ఉండదన్నారు. దేనికైనా విజన్, ఎగ్జిక్యూషన్ ఉంటేనే అవుట్‌కమ్స్ ఉంటాయన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండటం ఆనందం.. గ్రామాలకు వెళ్లడం మంచి అలవాటు.. కేంద్రం నుంచి పైసా సాయంలేదు..పైపెచ్చు ఎదురుదాడులు చేస్తున్నారు.. వాళ్లు ఏది చేసినా బూమరాంగ్ అవుతోందని విమర్శించారు. ఆ నలుగురు ఎంత టార్గెట్‌చేస్తే అంత లాభమన్నారు. వాళ్ల తిట్లే మనకు దీవెనలని వ్యాఖ్యానించారు. ప్రజాభిమానమే మన నైతికబలం.. దాంతో పాటు నేను ఒక్కడినే కష్టపడితే చాలదు.. పార్టీ బృందం అంతా కష్టపడాలి.. ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి ఉంటే పార్టీపై ఎందుకు రాదన్నారు. ఓటర్ల నమోదులో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని నిర్దేశించారు. ప్రతి నియోజకవర్గానికి సమాచారం పంపామన్నారు. పట్ట్భద్రుల నుంచి కౌన్సిల్ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలతో పాటు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. కౌన్సిల్ ఎన్నికల ఓటర్ల నమోదుకు వచ్చేనెల 6వ తేదీతో గడువు ముగుస్తుందని చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తే సత్ఫలితాలు రావన్నారు. సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఉద్బోధించారు. మొత్తం 45వేల 920 బూత్ కన్వీనర్లకు శిక్షణ 67 శాతం పూర్తయిందని మిగిలింది కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. అనంతపురం, నంద్యాల, నర్సాపురం, నెల్లూరు, అరకు పార్లమెంట్‌లలో శిక్షణ ఊపందుకోవాలన్నారు. గ్రామవికాసం కార్యక్రమాలు ముమ్మరంగా సాగాలని ఆకాంక్షించారు. ఇంకా 11వేల 532 గ్రామాలు, వార్డులలో దీన్ని నిర్వహించాల్సి ఉందన్నారు. అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు. ఎన్నికల్లో గెలవకపోతే గౌరవం రాదు.. ప్రజాసేవ చేసే అవకాశం ఉండదు.. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీల కుట్రలను తిప్పికొట్టాలి.. లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నేను చెప్పింది చేయండి.. ప్రజల్లో గౌరవం పెరుగుతుందని హితవు పలికారు. ప్రతిరోజు సగం సమయం పార్టీకి కేటాయిస్తాను.. తెలుగుదేశం మిషన్ 2019 ఎలక్షన్ అని అభివర్ణించారు. అంతా సైనికుల్లా ముందుకు ఉరకాలని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగాలన్నారు. పూర్తి శక్తి సామర్థ్యాలను గెలుపుపై కేంద్రీకరించాలని నిర్దేశించారు. రాత్రికి రాత్రే నాయకుడు ఉద్భవించడు.. సుదీర్ఘకాలం కృషిచేస్తేనే నాయకులవుతారని అభ్యాసంపైనే నాయకత్వం వస్తుందన్నారు. అధికారం గురించి ప్రశ్నించే ముందు బాధ్యతలను గుర్తించాలన్నారు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి కావాలన్నారు. సంక్షోభమే అవకాశంగా మలచుకోవాలన్నారు. తిత్లీ తుపాను సహాయ చర్యల్లో నేతలు, కార్యకర్తల కృషికి అభినందనలు తెలిపారు. బాధితులకు పార్టీ అండగా నిలవాలన్నారు. తుపాన్లు, కరవు వల్ల 13 జిల్లాలకు అపారనష్టం అనే ఆందోళన రాష్ట్ర విభజన లో వెల్లడైందని, టిట్లీ తుపాను పెనువిపత్తు శ్రీకాకుళంపై విరుచుకుపడిందని 160 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు కకావికలం చేశాయన్నారు. తుపాను ఎక్కడ తీరం దాటుతుందో ఖచ్చితమైన అంచనా వేశాం.. కానీ తొలి రెండురోజులు సహాయ చర్యల్లో వేగం తగ్గింది.. అందుకే బాధితుల్లో కొంతమేర అసంతృప్తి చోటు చేసుకుందన్నారు. తాను వెళ్లి అక్కడే మకాంవేసి సహాయ చర్యలను వేగవంతం చేయటం ద్వారా సంతృప్తి స్థాయిని పెంచ గలిగామన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు కష్టజీవులని, వలస వెళ్లి పనులుచేసే దుస్థితిని గత కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. సహాయ చర్యలను వైసీపీ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని కిరాయి మనుషులతో ఆటంకాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.