రాష్ట్రీయం

కూచిపూడిని నిలబెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు మంజూరు చేస్తాం
* ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కూచిపూడి, అక్టోబర్ 19: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లైన నాట్యక్షేత్రం కూచిపూడిని ప్రపంచ దేశాల సరసన నిలబెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా కూచిపూడిలోని పసుమర్తివారి ధర్మచెరువులో రూ.60 కోట్ల వ్యయంతో సిలికానాంధ్ర వసుధైక కుటుంబం, దాతల సహకారంతో నిర్మించిన రవిప్రకాష్ సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచానికి కూచిపూడి నాట్య కళను అందించిన ఈ గ్రామంలో సిలికానాంధ్ర నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం ద్వారా ఆరోగ్య హబ్‌గా రూపొందుతుందన్నారు. ప్రపంచంలోని ప్రతి కూచిపూడి కళాకారుడు ఈ గ్రామంలో గజ్జె కట్టేందుకు తరలి వచ్చే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పక్కా డ్రైనేజీ, ఇంటింటికి మంచినీటి కుళాయి, నాట్య పుష్కరిణి, నాట్యారామ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం నుండి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గన్నవరం నుండి హెలికాప్టర్‌లో కూచిపూడికి విచ్చేసిన ఆయనకు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, కూచిభొట్ల ఆనంద్, పలువురు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయాన్ని ప్రారంభించారు. ఓపీని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రవాస భారతీయులు, హాస్పటల్ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. దాతలు అందజేసిన విరాళాలను కూచిభొట్ల ఆనంద్‌కు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, మాగంటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఏపీ నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.