రాష్ట్రీయం

దసరా పర్వదినానభ్రమరాంబ నిజరూపదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా విజయదశమి సందర్భంగా గురువారం సాయంత్రం భ్రమరాంబిక అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆది దంపతులకు నందివాహన సేవ నిర్వహించారు. నవదుర్గ అలంకారాల్లో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ భ్రమరాంబాదేవి స్వరూపంలో (నిజాలంకరణ) అలంకరించారు. అష్ట్భుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘ ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి స్వామి అమ్మవార్లకు నంది వాహనసేవ నిర్వహించారు. అందంగా అలంకరించిన ఉత్సవమూర్తులను నంది విహనంపై ఆశీనులను చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం కన్నులపండువగా జరిగింది. అంతకుముందు గురువారం ఉదయం అమ్మవారికి సిద్ధిదాయిని అలంకారం నిర్వహించారు. అశ్వవాహన సేవ నిర్వహించారు. దసరా సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. విజయదశమి ఉత్సవాల్లోభాగంగా శ్రీశైలంలో తొలిసారి తెప్పోత్సవం నిర్వహించారు.