రాష్ట్రీయం

కరవుకు ఇక చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం శాసనసభలో 26 పేజీల ప్రకటన విడుదల చేసిన బాబు శాసనసభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. రికార్డు సమయంలో గోదావరి, కృష్ణా నదులను అనుసంథానం చేయడం ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంథానం చేసిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఖ్యాతినార్జించిందన్నారు. కృష్ణా, పెన్నా నదులను అనుసంథానం చేయడం కోసం చర్యలను ప్రారంభించామని తెలిపారు. నీరు చెట్టు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్నామని, కేవలం ఏడాది కాలంలోనే చెరువుల నుండి 16.68 కోట్ల క్యూబిక్ ఒండ్రును తొలగించామని అన్నారు. ఈ విధంగా చెరువుల నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతూ, 60,706 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని అన్నారు. చెట్లు నాటడాన్ని భారీ స్థాయిలో చేపడుతున్నామని అన్నారు. చెక్ డ్యాంలు, ఊట చెరువులు, కాంటూరు ట్రెంచ్‌లను నిర్మించి, 27707 నీటి సంరక్షణ కట్టడాలు, 82,029 ఇతర కట్టడాలను నిర్మించామని, 6.9 టిఎంసిల అదనపు నీటి సామర్ధ్యాన్ని ఈ కట్టడాల ద్వారా కల్పించడమైందని పేర్కొన్నారు. పంట సంజీవని అనే అద్వితీయ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో చేపట్టి లక్ష నీటి కుంటలను నిర్మిస్తామని పేర్కొన్నారు. భూగర్భ జలాల మెరుగుదలకు అన్ని చర్యలూ తీసుకున్నామని, 1254 ఆటోమెటిక్ వాటర్ లెవెల్ రికార్డర్ స్థాపనతో భూగర్భ జల మట్టాలను రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేపట్టడమైందని పేర్కొన్నారు. అనావృష్టికాలంలో జీవనాధార సాగునీటి కోసం రెయిన్ గన్స్ ప్రవేశపెట్టామని, హరిత కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇందులో వృధాను అరికట్టి జల సమర్ధతను మెరుగుపరిచేందుకు ఆటోమెటిక్ గేజ్‌లను స్థాపించామని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడచిన రెండేళ్లలో బడ్జెట్ కేటాయింపుల్లో 7888.62 కోట్లు కేటాయించినా, 12,023 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. అలాగే మహాత్మాగాంధీ ఎన్‌జిరేగా కింద మరో రెండు వేల కోట్లకు పైగానే వెచ్చించామని సిఎం పేర్కొన్నారు. గత రెండేళ్లలో సృష్టించిన ఆయకట్టు 1.182 లక్షల ఎకరాలు, స్థిరీకరించిన ఆయకట్టు 13.08 లక్షల ఎకరాలు. పేదరికాన్ని నిర్మూలించడం, ఆర్ధిక అసమానతలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నామని సిఎం పేర్కొన్నారు. ప్రాధమిక రంగాన్ని మిషన్‌లో జలపరిరక్షణ మిషన్ ఉప కార్యక్రమంగా చేర్చామని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన పలు నీటి పారుదల ప్రాజెక్టుల గురించి, వాటి స్థితి గతులు, యథాతథ స్థితిని చంద్రబాబు సభకు వివరించారు. రాష్టవ్య్రాప్తంగా వర్షపాతం చాలా అనిశ్చితితో ఉందని, కరవు పునరావృత్తం కావడం అసాధారణమని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణం 395.13 లక్షల ఎకరాలు కాగా, సాగు విస్తీర్ణం 199.04 లక్షల ఎకరాలు ఉందని, కల్పించిన సాగునీటి సామర్ధ్యం 101.17 లక్షల ఎకరాలుందని, సాగుచేయదగిన మిగిలిన విస్తీర్ణం 97.80 లక్షలు ఎకరాలుందని చెప్పారు. కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో కొత్త ఆయకట్టు 28.44 లక్షల ఎకరాలకు దక్కుతుందని వివరించారు.
రాష్ట్రంలో 40 భారీ మధ్య తరహా, చిన్న తరహా నదులు వరప్రసాదంగా ఉన్నాయని, గత ఏడాది ఖరీఫ్‌లో 88.65 లక్షల ఎకరాలు, రబీలో 57.30 లక్షల ఎకరాలు, 2015-16లో ఖరీఫ్‌లో 77.29 లక్షల ఎకరాలు, రబీలో 57.45 లక్షల ఎకరాలు సాగు అయ్యిందని సిఎం వివరించారు. రాష్ట్రప్రభుత్వం రానున్న రోజుల్లో బిఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేట్ -2), తోటపల్లి బ్యారెజ్, పోలవరం ఆర్‌ఎంసి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, కెఓఆర్ గండ్లకమ్మ రిజర్వాయర్, జిఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-1, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని సిఎం పేర్కొన్నారు.

చిత్రం... శ్రీశైలం అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు