రాష్ట్రీయం

నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రముఖ సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ (75) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున 3గం.లకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కళారంగంలో వైజాగ్ ప్రసాద్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. ఆయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఆయనకు కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్ ఉన్నారు. 1963లో నాటక రంగంలోకి అడుగుపెట్టిన వైజాగ్ ప్రసాద్.. అప్పుపత్రం, భలేపెళ్లి, భజంత్రీలు, కాలధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్, గరీబీ హఠావో వంటి పేరు పొందిన నాటికల్లో నటించిన ఆయన 1983లో బాబాయ్ అబ్బాయ్ చిత్రం ద్వారా చిత్ర సీమలోకి ప్రవేశించారు. ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన నువ్వునేను, భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా తదితర చిత్రాల్లో ఆయన నటించారు. వైజాగ్ ప్రసాద్ మృతిపట్ల టాలీవుడ్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసింది. వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పక్షాన అధ్యక్షులు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి డా.వి. కె.నరేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ (ఫైల్‌పొటో)