రాష్ట్రీయం

బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్ : దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మతతత్వ భారతీయ జనతాపార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని వైసీపీ మైనార్టీ సెల్ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహ్మాన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. అనంతపురం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సుకు రెహ్మాన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కేబినెట్‌లో ఒక్క ముస్లిం అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో జత కట్టి రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. 40 ఏళ్ల సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబు ముస్లింల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ఇక దేశంలోని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో మైనార్టీల జీవితాలు దయనీయంగా ఉన్నాయన్నారు. అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీనే కారణమన్నారు. కావున ముస్లిం మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా విశేష కృషి చేసిన మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆయన ఆశయ సాధన కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. వైసీపీ ముస్లింలకు అండగా ఉంటుందన్నారు.

చిత్రం..ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సులో మాట్లాడుతున్న వైసీపీ మైనార్టీ సెల్ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహ్మాన్