రాష్ట్రీయం

న్యాయం జరిగేదాకా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాడతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పోరాటదీక్ష పేరిట రిలే దీక్షలు ప్రారంభించారు. ఐదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిలే దీక్షలు జరుగుతాయి. రాంమాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బాధితులు ఢిల్లీ వచ్చి అగ్రనేతల్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. దాంతో బాధితుల తరపున ఉద్యమించి వారికి న్యాయం చేసేందుకు పోరాటం చేయాలని అగ్ర నాయకత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం విలువ రూ. 6500 కోట్లని, ఇతర రాష్ట్రాల్లో కుంభకోణాలు జరిగితే ఆయా ప్రభుత్వాలు వాటిపై విచరాణ చేపట్టి బాధితులకు వెంటనే న్యాయం చేశాయన్నారు. త్రిపురలో రోజ్‌వాలి కుంభకోణాన్ని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వ అవినీతితోనే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. టీడీపీ అంటే ‘తెలుగు దోపీడీ పార్టీ’ అని చంద్రబాబు నాయుడు గోబెల్స్‌కు గురువు లాంటి వాడని, ఏపీలో హిట్లర్ పాలన నడుస్తోందన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమారుడు లోకేష్ కనే్నశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు రోజురోజుకు ఎందుకు కరిగిపోతున్నాయని జీవీఎల్ ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం పేరుతో పేదల భూములు కబ్జా చేసినట్లు, పేదల డబ్బులు కూడా తినేయాలని వారు చూస్తున్నారని విమర్శించారు. ఏపీలో లాలూచీ పాలన నడుస్తోందన్నారు. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. పథకం ప్రకారం అగ్రిగోల్డ్‌ను నిర్వీర్యం చేసి దానిని కొట్టేద్దామని తెదేపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు ఎందుకు చెప్పడంలేదని, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధుల నుంచి తుపాను బాధితులకు ఎంత ఖర్చు చేసారని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేద్దామనే ప్రభుత్వ అవినీతి చర్యల వల్ల 35లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. వీరికి న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే వారం రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలేదీక్షలు ప్రారంభించామన్నారు. ధర్నాలో ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాష్ట్ర నేతలు పలువురు ప్రసంగించారు.
రెండు నిమిషాల వౌనం
మంత్రాలయంలో నేడు అగ్రిగోల్డ్ ఏజెంట్ రాజు ఆత్మహత్య చేసుకోవటం పట్ల నేతలు ప్రగాఢ సంతాపం తెల్పుతూ శిబిరం ముగింపు సభలో రెండు నిమిషాలు వౌనం పాటించారు. తొలి రోజు దీక్షలను ఏపీ ఇన్‌చార్జి సునీల్ దియోదర్ విరమింపజేశారు.
చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్