రాష్ట్రీయం

విస్తృతంగా ప్రచారం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో ప్రజా గాయకుడు గద్దర్ సమావేశమయ్యారు. సోమవారం పొన్నాల నివాసానికి గద్దర్ వెళ్ళారు. ఈ సందర్భంగా ఇరువురూ తాజా రాజకీయ పరిస్థితులపై మంతనాలు జరిపారు. రాష్ట్రంలో జరుగుతున్న కుటుంబ పాలనకు తెర దించాలని, నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని తాను కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించుకున్నానని గద్దర్ అన్నట్లు సమాచారం. అందుకే తాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనీ, సోనియా గాంధీనీ కలిసి చర్చించానని ఆయన తెలిపారు. కాగా గజ్వేల్ నుంచి తాను

మహా (ప్రజా) కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి కూడా గద్దర్ ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే పోటీ చేసే విషయంలో ఇప్పుడే చెప్పలేనని, ప్రచారం మాత్రం చేస్తానని ఆయన అన్నట్లు సమాచారం. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతలతో చర్చించి ప్రజాకూటమిగా ఏర్పాటు చేయడంలో ముఖ్యభూమిక పోషించారని గద్దర్ పొన్నాల లక్ష్మయ్యను అభినందించారు.

చిత్రం..పొన్నాలతో భేటీ అయన గద్దర్