ఆంధ్రప్రదేశ్‌

పగలు సెగలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: మండే ఎండలకు ఈక్వినాక్స్ ప్రభావం తోడవడంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూమధ్య రేఖ మీద సూర్యుడు నిట్టనిలువుగా ఉండటానే్న ఈక్వినాక్స్ ఫినామినాగా వ్యవహరిస్తారు. ఏటా మార్చి 21, 22 తేదీల్లో ఇది చోటు చేసుకుంటుంది. ఈ సమయంలో భూమి సూర్యుడి నుండి దూరంగా కానీ దగ్గరకు కానీ వెళ్లకుండా స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. దీనివల్ల సూర్యుడి తాపం భూమధ్య రేఖ ప్రాంతంపై ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నుంచి ఉత్తరం వైపుగా సూర్యుడు పయనిస్తాడు. ఈ పయనం భారతదేశం మీదుగా ఉండటంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే దాకా ఈ పరిస్థితి ఉంటుంది. ఈక్వినాక్స్ ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకూ ఎక్కువగా నమోదు అవుతుంటాయి.
కాలుష్యమే కారణం
పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కారణమవుతోందని వాతావరణ శాఖ విశ్రాంత అధికారి మురళీకృష్ణ తెలిపారు. భూమి చుట్టూ పొరలా కాలుష్యం ఆవరించి ఉండటం వల్ల వేడిగాలులు భూ ఉపరితలంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంటున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో కావలి నుంచి మచిలీపట్నం వరకూ సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపారు.
11కు చేరిన యువి ఇండెక్స్
ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయని ఎయు వాతావరణ శాస్త్ర నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు. మంగళవారం ఈ ఇండెక్స్ 11గా నమోదు అయిందని తెలిపారు. ఎండలో తిరిగితే దీని ప్రభావం వలన చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఈక్వినాక్స్ ప్రభావం ప్రస్తుతం దక్షిణ భారతదేశంపై ఉందని, హోలీ పండుగ తరువాత ఉత్తర భారతదేశంలో ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ రెండో వారంలో నమోదు కావల్సిన ఉష్ణోగ్రతలు మార్చి మూడో వారంలోనే నమోదవుతున్నాయన్నారు.