రాష్ట్రీయం

పల్లెల్లో ప్రచార జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 22: ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కొలిమి మండుతోంది. షెడ్యూల్‌కు గడువు సమీపిస్తుండగా, రెండు అధికార పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పోలింగ్‌కు మరో 45 రోజులు మాత్రమే సమయముండటంతో, తెరాస, భాజపాల్లో ప్రచార జోష్ పెరిగింది. పల్లెలు, పట్టణాల్లో ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవటంలో రెండు పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. అధికార టీఆర్‌ఎస్ తన అభ్యర్థుల జాబితా 47రోజుల క్రితమే వెలువరించగా, భాజపా రెండు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే, రెండు పార్టీలకు ప్రధాన పోటీనివ్వబోతున్న మహాకూటమిలో మాత్రం ఇప్పటికీ పొత్తుల లెక్కలు తేలకపోవటంతోప్రాతినిత్య పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఆరంభించలేదు.
అభ్యర్థుల ప్రకటన నుంచి మొదలు ప్రచారం వరకు తెరాస రెండడుగులు ముందంజలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేసి, పలుచోట్ల రెండోవిడత కూడా మొదలు పెట్టారు. బీజేపీ అభ్యర్థులు కూడా జిల్లాలో తమ ప్రచారాన్ని ఆయా సెగ్మెంట్లలో మొదలుపెట్టినా, ఇటీవలే అధికారికంగా వారి పేర్లను అధిష్టానం విడుదల చేసింది. దీంతో ఆపార్టీ అభ్యర్థులు కూడా జోరు పెంచారు. కరీంనగర్, పెద్దపల్లి, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్లలో గెలుపే లక్ష్యంగా తాము కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బీజేపీ అభ్యర్థులు వివరిస్తుండగా, యాభై ఏళ్ళలో జరగని అభివృద్ధిని నాలుగున్నరేళ్ళలో చేసి చూపామంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోతమ ప్రచార సరళి కొనసాగిస్తుండగా, కూటమిలోని భాగస్వామ్య పార్టీల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికింకా కాంగ్రెస్ పొత్తులపై తేల్చకపోగా, తమకు పట్టున్న సెగ్మెంట్లలోనైనా ఒంటరి ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించకపోవటంపై ఆయా పార్టీలు భగ్గుమంటున్నాయి. ఓవైపు గడువు ముంచుకొస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నాయకుల తీరుపై మిగతా పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కూటమిలోని భాగస్వామ్య పార్టీ అయిన సీపీఐ పొత్తులు పొడిచేలా కృషి చేస్తూనే, తనకు పట్టున్న హుస్నాబాద్, మానకొండూర్, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి కార్యకర్తలను ఉద్యుక్తులను చేస్తున్నట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

చిత్రం..కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్