రాష్ట్రీయం

కూటమిలో ‘దేశం’ ఉనికెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 22: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఆయా నియోజకవర్గాల్లో చెక్ పెట్టి తన ఆదిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాస్తోకూస్తో పరువు నిలబెట్టుకున్నా ప్రస్తుత ముందస్తు ఎన్నికల్లో అది కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి క్లీన్‌చీట్ ఇచ్చి పూర్తి స్థాయి ఆదిపత్యాన్ని చాటుకుంది. 1999 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని పార్టీగా సత్తా చాటుకుంది. అనంతర రాజకీయ పరిణామాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోవడం ప్రారంభించుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెనువెంటనే వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఒక్క గజ్వేల్ నియోజకవర్గం మినహాయిస్తే ఏ నియోజకవర్గంలో కూడా కనీస పోటీని ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనడమే కాకుండా ప్రత్యర్థి పార్టీగా ఉన్న టీడీపీ ప్రస్తుతం చిరకాల ప్రత్యర్థితోనే చేతులు కలిపి ముందస్తు ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చే నాయకుడు కనిపించకపోవడం ఆ పార్టీకి తీరని నష్టమే అని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగి గులాబి దళపతికి గుబులు పుట్టించిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ అభ్యర్థిగా ప్రచారం హోరెత్తిస్తున్నాడు. దీంతో టీడీపీ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో అభ్యర్థి దొరకడం కష్టమే అని చెప్పవచ్చు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఆదిపత్యాన్ని చాటుకున్న టీడీపీకి కనీస నాయకుడే లేకపోవడంతో ఉన్న కార్యకర్తలు సైతం మిన్నకుండిపోతున్నారు. పటన్‌చెరు నియోజకవర్గానికి చెందిన శశికళ యాదవరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్ప నుంచి టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పటన్‌చెరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గొప్పగా చెప్పుకోవడానికి జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ ఉండటం కొంత మేరకు ఊరటనిస్తోంది. ఇటీవలే సైకిల్ ఎక్కిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ చేరికతో పటన్‌చెరులో టీడీపీ కాస్తంత గౌరవం దక్కించుకుంటుంది. పొత్తుల వ్యవహారం తేలక కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు తలపట్టుకుంటున్న తరుణంలో నందీశ్వర్‌గౌడ్ టీడీపీలో చేరి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందస్తు ఒప్పందం ప్రకారం పటన్‌చెరు నియోజకవర్గాన్ని టీడీపీకి కట్టబెట్టించుకోవడమే నందీశ్వర్ ఎత్తుగడగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎప్పటి మాదిరిగానే నరోత్తం తనవంతుగా తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటుతుండగా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. మెదక్, దుబ్బాక, నర్సాపూర్, అందోల్, గజ్వేల్, సిద్దిపేట, సంగారెడ్డి నియోజకవర్గాల్లో నాయకులు కరువయ్యారు. జిల్లాకు ఒక్క నియోజకర్గాన్ని పొత్తులో కోరుకున్నా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని ఆశిస్తుందో చెప్పని పరిస్థితి దాపురించింది. జహీరాబాద్‌ను కేటాయించాలని కోరుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఎంత మాత్రం లేదు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ పాత్రను పోషిస్తుంది.