రాష్ట్రీయం

విశాఖలో ఫిన్‌టెక్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 22: ఫిన్‌టెక్ ఫెస్టివల్ విశాఖలో సోమవారం ప్రారంభమైంది. ఈనెల 26 వరకూ జరిగే ఈ ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కీలక ప్రసంగం చేయనున్నారు. అలాగే, సుమారు 100 మంది ఐటీ కంపెనీల ప్రతనిధులతో సుమారు గంటసేపు భేటీకానున్నారు. రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటీ దిగ్గజాలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ ఫెస్టివల్‌కు సంబంధించి ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఫిన్‌టెక్‌కు ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. విశాఖను ఫిన్‌టెక్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఇక్కడున్న వౌలిక సదుపాయాలు ఫిన్‌టెక్ వ్యాలీకి అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. ఫిన్‌టెక్ ఇండ్రస్ట్రీని గత ఏడాది రాష్ట్రానికి పరిచయం చేశామని, ఈ ఏడాది ఫిన్‌టెక్ ఆధారిత కంపెనీలు విశాఖకు తీసుకువచ్చేందుకు అంకురార్పణ చేశామని చెప్పారు. ఇందులో భాగంగానే మిలియన్ డాలర్ల ఫిన్‌టెక్ ఛాలెంజ్‌ను వివిధ దేశాల్లో నిర్వహించామని చెప్పారు. ఇందులో 40 కంపెనీలు తమ ప్రతిభను కనబరిచాయని, ఈ కంపెనీలు విశాఖలో జరిగే ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో జ్యూరీ ముందు తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయని ఆయన చెప్పారు. ఇందులో ఆరు కంపెనీలను విన్నర్, రన్నర్స్‌గా ఎంపిక చేయనున్నామని ఆయన తెలియచేశారు. ఇదిలా ఉండగా ప్రపంచ శ్రేణి ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించేందుకు 22 మందితో ఫిన్‌టెక్ కోర్ టీం ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఐటీ కంపెనీల్లో పనిచేయడానికి కావల్సిన నైపుణ్యత కోసం అర్హులైన అభ్యర్థులను యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీకి పంపించి, అక్కడ శిక్షణ ఇప్పిస్తామని చౌదరి వెల్లడించారు. విశాఖలో ఫిన్‌టెక్ రంగంలో వచ్చే ఏడాది లోగా సుమారు 5000 ఉద్యోగాలు లభించనున్నాయని ఆయన చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో న్యూజెర్సీకి చెందిన తాళ్ల రామ్, యూఎస్‌కు చెందిన రావ్ తాడేపల్లి, బాల, శ్రీ, అనిత, అట్లూరి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జేఏ చౌదరి