రాష్ట్రీయం

వ్యక్తిగత హాజరు నుంచి సుజనా చౌదరికి మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మారిషస్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు కేసులో తాను కోర్టు ఎదుట హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఇటీవల మారిషస్ బ్యాంకు కేసులో సుజన యూనివర్శల్ ఇండస్ట్రీస్‌కు చెందిన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టెర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎండి జి శ్రీనివాసరాజు, డైరెక్టెర్ హనుమంతరావు మార్చి 22వ తేదీ మంగళవారం కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సుజనాయూనివర్శల్ ఇండస్ట్రీస్ రూ.106 కోట్ల రుణం మంజూరులో గ్యారంటీగా ఉందని, అప్పు తీసుకున్న సంస్ధ ఎగవేసిందని, తమకు బకాయిలు ఇప్పించాలని కోరుతూ మారిషస్ బ్యాంకు మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదుచేసిన విషయం విదితమే.
మంగళవారం మెజిస్ట్రేట్ కోర్టుకు సుజనా యూనివర్శల్ ప్రతినిధులు శ్రీనివాసరాజు, హనుమంతరావు హాజరయ్యారు. తాను పార్లమెంటు సభ్యుడని, అత్యవసరమైన పనిలో ఢిల్లీలో ఉన్నందున హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని అభ్యర్ధిస్తూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మెజిస్ట్రేట్ ఈ దరఖాస్తుపై విచారిస్తూ అత్యవసరమైన పని అనే కారణంతో కోర్టుకు హాజరు కాకుండా ఉండరాదని, పార్లమెంటు సమావేశాలు నేపధ్యంలో అని ప్రస్తావించాలని మంత్రి సుజనా చౌదరి తరఫున న్యాయవాదిని కోరారు. ఈ విషయాన్ని దరఖాస్తులో ప్రస్తావించడంతో మెజిస్ట్రేట్ కేంద్ర మంత్రికి హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చారు. మారిషస్ బ్యాంకు తరఫున న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కేంద్ర మంత్రి సుజనా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంటు ఇవ్వాలని అభ్యర్ధించారు. మెజిస్ట్రేట్ జోక్యం చేసుకుని వైఎస్ చౌదరి రాజ్యసభ సభ్యుడని తెలిపారు. రూ.50 వేల పూచీకత్తుతో రెండు బాండ్లను సమర్పించాలని మెజిస్ట్రేట్ సుజనా యూనివర్శల్ సంస్ధ న్యాయవాదులను ఆదేశించారు. అనంతరం ఈ కేసు విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు.