తెలంగాణ

వచ్చే నెలలో ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: రాష్ట్రంలో వర్షాభావం కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం ఎంతో పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పారు. ఇందుకు గాను ఇప్పటికే పంట నష్టపోయిన రైతులకు ఏప్రిల్, మే మాసాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ అందజేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో కరువుపై జరిగిన చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ, కరువు మండలాలను గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రమాణాలున్నాయని, అత్యల్ప, అతి అత్యల్ప వర్షాలు, అసలు వర్షాలు కురవకపోవటం వంటి ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలను గుర్తించామని పోచారం వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 231 మండలాలను గుర్తించామని వివరించారు. ఆయా మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు వీలైనంత త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాత్రం 438 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారని, అది ఎలా శాస్ర్తియమో వివరించాలని మంత్రి సూచించారు. తాము గుర్తించిన మండలాలు కాకుండా కరువు మండలాలను గుర్తించేందుకు ఉన్న ప్రత్యేక గైడ్‌లైన్స్, నిబంధనలు వర్తించే ప్రాంతాలేమైనా ఉంటే అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రైతుల ఆత్మహత్యలు అనేవి ఇపుడు మాత్రమే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నవి కావని, కాంగ్రెస్, టిడిపి హయంలోనూ 7304 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సంభవించాయని వివరించారు. త్రిసభ్య కమిటీ దర్యాప్తు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 462 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని, వీటిలో అన్ని రకాలుగా పరిశీలించి 404 మంది రైతుల కుటుంబాలకు రూ. 6 లక్షలు చొప్పున నష్టపరిహారాన్ని అందజేసినట్లు వివరంచారు. మరో 16 కేసులు ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్నాయని, 31 కేసులు బోగస్ కేసులుగా గుర్తించినట్లు వెల్లడించారు.