ఆంధ్రప్రదేశ్‌

టిటిడి తరహాలో శ్రీశైలం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆల యం, విజయవాడ కనకదుర్గ గుడి అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలపై సిఎం చంద్రబాబునాయుడు సచివాలయంలో సమీక్షించారు. శ్రీశైలం ఆలయాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాలని, కృష్ణా పుష్కారాలలోగా ప్రణాళికలు అమలు జరగాలని ఆదేశించారు. శ్రీశైలం ఆలయం కేంద్ర బిందువుగా సమీపంలోని ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో నాలుగు లేదా ఐదు టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీశైలం చుట్టూ ఏడు కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. శ్రీశైలం ఆలయం సమీపం నుండే జాతీయ రహదారి వెళుతోందని ఈ రహదారిని వంపులు లేకుండా నిర్మించాల్సి ఉందని అన్నారు. శ్రీశైలం ఆలయం చుట్టుపక్కల ఆక్రమణలను,ప్రైవేటు కట్టడాలను తొలగించి వారికి సున్నిపెంటలో పునరావాసం కల్పించాలని ఆదేశించారు. శ్రీశైలం, సున్నిపెంటలను సుందరీకరణ చేయాలని సిఎం కోరారు. శక్తిపీఠాలలో ఒకటిగా, 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా విలసిల్లుతున్న శ్రీశైలం రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని అన్నారు. ఆదిశంకరాచార్యులు పాదస్పర్శతో పునీతమైన నేల శ్రీశైలమని, ఆయన రెండు నెలలు ఇక్కడే ఉండి శివానందలహరి , సౌందర్యలహరి గ్రంథాలను రచించారని శ్రీ చక్రను శ్రీశైలంలో ప్రతిష్టించారని సిఎం అన్నారు. అలాగే కృష్ణపుష్కరాలను భారీ ఎత్తున నిర్వహించాలని సూచించారు. టిటిడి తరహాలో శ్రీశైలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు.ప్రముఖ దేవాలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీశైలం మాడవీధులను వెడల్లు చేయాలని అధికారులను ప్రతిపాదించారు. నీటి సరఫరా పథకానికి రూ. 28.95 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 25.22 కోట్లు , వాణిజ్య భవన సముదాయం కోసం 25 కోట్లు , ప్రత్యేక క్యూ కాంప్లెక్స్‌కు 20 కోట్లు, బసవన్న మార్గం రింగ్ రోడ్డు కోసం 11 కోట్లు, శ్రీశైలంలో అంతర్గత రహదార్లుకు మూడు కోట్లు, అత్యున్నత భద్రతా జోన్ కోసం కోటి రూపాయిలు , పాతాళగంగ మెట్ల దగ్గర రక్షణ చర్యలకు 5 కోట్లు చొప్పున మొత్తం 144.17 కోట్లు వెచ్చించనున్నారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు 14.50 కోట్లకు గానూ10 కిలోమీటర్లు మార్గం ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్ 30 నాటికిక మరో 8 కిలోమీటర్లు మార్గం పూర్తయింది. పుష్కరిణి మొదటి దశ కొసం 3.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత వరకూ 95 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తుల రాకపోకలకు అనువుగా కాలిబాట వంతెనలు నిర్మించాలని అధికారులను సిఎం ఆదేశించారు. గోశాల భూమిని తీసుకుని అర్జుని వీధిని 60 అడుగుల వెడల్పు రోడ్డుతో తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎంతో పాటు దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్, దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.