ఆంధ్రప్రదేశ్‌

చెల్లి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 23: తానెంతో అభిమానించే చెల్లి ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అన్న కూడా 24గంటలు తిరగకుండా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో మనస్తాపానికి గురైన తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక చోడిదిబ్బకు చెందిన పార్వతికి కుమారుడు చింటూ వరప్రసాద్, కుమార్తె యామిని ఉన్నారు. యామిని ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. సోమవారం సాయంత్రం తల్లి పార్వతి వ్యాపారం నిమిత్తం బయటకువెళ్ళింది. అయితే ఆమె తిరిగి వచ్చేసరికి యామిని ఇంట్లో లేకపోవటంతో తిరిగి వచ్చిన తర్వాత మందలించింది. దీనితో అదే రోజు రాత్రి యామిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందింది. ఈసమయంలో తిరుపతిలో ఉన్న అన్న వరప్రసాద్ సమాచారం తెలుసుకుని ఏలూరు వచ్చాడు. తాను ఎంతో అభిమానించే చెల్లి దూరమైందన్న బాధతో బుధవారం ఉదయం స్ధానిక మార్కెట్‌యార్డు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వరప్రసాద్ బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కూతురు, కొడుకు ఆత్మహత్య చేసుకుని విగతజీవులుగా మారిపోవటంతో తల్లి పార్వతి తీవ్ర ఆవేదనకు లోనైంది. అదే ఆవేశంలో ఆమె కూడా నేనెందుకు ఉండాలంటూ ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలవైపు పరుగు తీసింది. దీన్ని గమనించిన స్ధానికులు ఆమెను వారించారు. వరప్రసాద్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అజ్ఞాతంలో ఎసిపి దాసరి రవిబాబు
* రక్షణ కల్పించాలని మంత్రిని ఆశ్రయించిన పద్మలత
* విచారణకు సిపి ఆదేశం
విశాఖపట్నం(క్రైం), మార్చి 23: మధురవాడ ఎసిపి దాసరి రవిబాబుపై మాజీ ఎమ్మెల్యే కుమార్తె నగర పోలీసు కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. జిల్లాలోని ఎస్.రాయవరం ప్రాంతానికి చెందిన కాకర్ల పద్మలత, తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్‌పిపిగా పద్మలత ఉండేవారు. ఆ సమయంలో రాయవరం సిఐగా ఉన్న దాసరి రవిబాబుతో ఆమెకు పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో వారిద్దరి మధ్య స్నేహం పెరగడంతో నీ భర్తను వదిలేస్తే పెళ్ళి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె భర్త నుండి దూరమైనట్టు సిపికి ఇచ్చిన ఫిర్యాదులో పద్మలత తెలిపారు. అప్పటి నుండి వివాహం చేసుకుంటానని, తనను మోసం చేసి రవిబాబు తప్పించుకుని తిరుగుతున్నాడని, ఎసిపి అయిన తర్వాత అసలు తనను పట్టించుకోవడం లేదని ఆమె ఫిర్యాదులో వాపోయింది.

మోసం చేసిన రవిబాబుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె సిపి కార్యాలయంలోని సిసి సెల్‌లో ఫిర్యాదు అంద చేయడంతో దీనిపై విచారణ చేయాల్సిందిగా సిపి ఓ పోలీసు ఉన్నతాధికారికి ఆదేశాలు జారీ చేసినట్టు బుధవారం విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా ఎసిపి రవిబాబు నుండి తనకు ప్రాణభయం ఉందని పద్మలత ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి వద్ద వాపోవడంతో ఆయన, బాధితురాలికి ఆశ్రయం ఇచ్చి రక్షణ కల్పించినట్టు తెలిసింది. ఇటీవల లంచం కేసులో ఓ సిఐ, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో మరో సిఐ, ఇప్పుడు దాసరి రవిబాబు వ్యవహారం. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు పోలీసు శాఖకు చెడ్డపేరు మూట కడుతుండడంతో సిపి ఆమిత్‌గార్గ్ మండి పడుతున్నారు.

రేపటినుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో
ఎన్టీఆర్ వైద్య సేవ నిలిపివేత

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 23: ఈ నెల 25 నుంచి రాష్టవ్య్రాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ నిలిచిపోనుంది.
కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు బుధవారం నగరంలో సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ చెల్లించాల్సిన రూ.350 కోట్లు పైగా బకాయిలను విడుదల చేయకపోవటాన్ని నిరసిస్తూ పై నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆంప్ర స్పెషాలిటి హాస్పిటల్ అసోసియేషన్ ‘ఆషా’ అధ్యక్షులు డాక్టర్ వి.మురళీ కృష్ణ బుధవారం రాత్రి నేడిక్కడ ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి కోసం కార్పొరేట్ ఆసుపత్రి వర్గాలు 8ఏళ్లుగా అనూహ్యమైన వైద్య సేవలందిస్తూ వచ్చిందన్నారు.
ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా ధరలను పెంచకపోగా బకాయిలను కూడా చెల్లించకపోవటాన్ని ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. తమకు రావల్సిన బకాయిలు మొత్తం లభించిన తర్వాత తిరిగి ఈ వైద్యసేవలు కొనసాగిస్తామన్నారు. ఈ నెల 25న ఉదయం సంఘం సభ్యులందరూ కలసుకుని చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించామన్నారు.