రాష్ట్రీయం

గోదావరి తీరంలో కార్తీక సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 8: గోదావరి తీరం కార్తీక మాసం సందడి ఆరంభమైంది. గురువారం వేకువజామున భక్తుల పుణ్య స్నానాలతో ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి స్నాన ఘట్టాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో గోదావరి తీరంలో ఆధ్యాత్మిక వాతావరణం ఆవరించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని పంచారామ క్షేత్రాలతోపాటు ప్రఖ్యాత శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేకించి మహిళలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలు వేకువజాము నుంచి రద్ధీగా మారాయి. పుష్కర ఘాట్, సరస్వతి ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమీ ఘాట్లలో భక్తుల రద్ధీ విపరీతంగా కన్పించింది. తొలి రోజు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్నానాలు ఆచరించారు.
అనంతరం శ్రీ ఉమాకోటిలింగేశ్వరస్వామి, శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి, శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి, శ్రీ విశే్వశ్వరస్వామి, లక్ష్మీవారపుపేట శివాలయం, దేవీచౌక్ శ్రీ బసవలింగేశ్వరస్వామి, సారంగధరేశ్వరస్వామి ఆలయం, సర్వేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. దైవ దర్శనం అనంతరం భక్తులు పాపికొండలు, కడియం నర్సరీల సందర్శనలకు, పంచారామ క్షేత్రాల దర్శనం చేసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి టూరిస్టు బస్సులో భక్తులు వచ్చి గోదావరి నది స్నానాలు ఆచరించారు.
చిత్రం..గురువారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో గోదావరి తీరంలో పుణ్యస్నానాలు మొదలయ్యాయ.
రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో భక్తుల సందడితోపాటు శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయ.