రాష్ట్రీయం

చేసిన ద్రోహం చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: అడుగడుగునా తెలంగాణకు ద్రోహం చేసిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని పోటీ చేస్తుందని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. టీడీపీ హయాంలో తెలంగాణ పదానే్న పలకొద్దని నిషేధం విధించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలను వివరిస్తూ 19 అంశాలపై హరీశ్‌రావు బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు దేవిప్రసాద్, గట్టు రామచంద్రరావుతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి. ఇక్కడి ప్రజలపై ద్వేషం పెంచుకున్న ఆయన అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉచ్చరించవద్దని నిషేధించారు’ అని ఆయన నిప్పులు చెరిగారు. మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా చివరి వరకు యత్నించడమే కాకుండా రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి కుట్రలు పన్నారని హరీశ్ తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసుకున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అలాంటి చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి ఎన్ని విధాలుగా కుట్రలు, కుతంత్రాలు పన్నారో 19 అంశాలపై నిలదీస్తూ చంద్రబాబుకు బహిరంగ లేఖ విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా, మంత్రిగా తాను మేకవనె్న పులి చంద్రబాబు ద్రోహ చరిత్రను ప్రజల ముందు పెట్టడాన్ని బాధ్యతగా భావిస్తూ ఈ లేఖ రాశానన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను రాకుండా చేసి ఇక్కడ కటిక చీకట్లు అలుముకోవాలని, ఇక్కడి రైతుల పంటలు ఎండిపోవాలని, పరిశ్రమలు మూతపడాలని దుర్మార్గంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రి సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని లాక్కున్నారన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు సముద్రంలో కలిసినా ఫర్వాలేదు కానీ, తెలంగాణకు మాత్రం దక్కకూడదని పన్నాగం పన్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో నిలదీసిన చంద్రబాబే, రాష్ట్రం ఏర్పడిన దీనిని నిర్మించకుండా ఆపాలని కేంద్రానికి లేఖ రాశారన్నారు. అన్ని అనుమతులు వచ్చిన కాళేశ్వరంతో పాటు సీతారామ, భక్తరామదాసు, తుమ్మిళ్ల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్టుపడినందుకు కూటమికి ఓట్లు వేయాలా? అని చంద్రబాబును హరీశ్‌రావు నిలదీశారు. తుంగభద్ర నుంచి పెన్నా అహోబిలానికి 40 టీఎంసీల నీళ్లు అక్రమంగా తరలించుకుపోయేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ‘ఖాళీగా ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఇవ్వమన్నా ఇవ్వలేదు. తెలంగాణ పట్ల సంకుచిత, ద్వేషభావం కలిగిన మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి’అని ఆయన ప్రశ్నించారు.
చిత్రం..తెలంగాణ భవన్‌లో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేస్తున్న మంత్రి హరీశ్‌రావు