రాష్ట్రీయం

12నుంచి కేసీఆర్ ప్రచార భేరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు ఈ నెల 12న ప్రారంభించే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ ముహుర్తం కూటమి అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల కాకుంటే మాత్రం ఒకటి, రెండు రోజులు అటు ఇటుగా ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదని తాజా సమాచారం. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో అప్పటి వరకు కూటమి జాబితా, మేనిఫెస్టో విడుదల కాకపోయినా ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5న సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగింపునకు గడువు. ఎన్నికల నోటిఫికేషన్, ప్రచార గడువుకు మధ్య 23 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో మధ్యలో మూడు రోజుల విరామం తీసుకున్నా 20 రోజలపాటు నిర్విరామంగా ప్రచారాన్ని నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. రోజుకు మూడు లేక నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం
నిర్వహించినా 60 నుంచి 70 సభలు జరుగుతాయని అంచన వేస్తున్నారు. ఎంఐఎం పోటీ చేసే 7 స్థానాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాలు, తొలి విడతలో నిర్వహించిన నియోజకవర్గాలను మినహాయిస్తే 60 నుంచి 65 సభల కంటే ఎక్కువ కాకపోవచ్చని అంచనా వేస్తోంది. ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్న సర్వే నివేదికల ఆధారంగా కచ్చితంగా గెలిచే నియోజకవర్గాలలో సభలు అవసరం లేదని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ఒకే చోట భారీ బహిరంగ సభ నిర్వహిస్తే ఎలా ఉంటుందని పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ప్రచార గడువు ముగియడానికి రెండు రోజుల ముందు జంట నగరాల్లో రోడ్ షో నిర్వహిస్తే సరిపోతుందని పార్టీ నేతలు కొందరు సూచించగా, మరి కొందరు అన్ని నియోజకవర్గాలకు కలిపి కొంగర కలాన్ మాదిరిగా భారీ సభ నిర్వహిస్తే సరిపోతుందని సూచించినట్టు తెలిసింది. ఒకే చోట భారీ సభ నిర్వహించడం వల్ల సమయం కలిసి వస్తుందని, అలాగే ఇది రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం డిసెంబర్ 3,4,5 తేదీలలో మాత్రమే సభలను నిర్వహించాలని, ఆ లోగా ఈ నెలాఖరులోగా కనీసం 60 చోట్ల అయినా సభలు నిర్వహించాలని తాజాగా నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం.