రాష్ట్రీయం

మనసు పెట్టి చేశాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దేశంలో ముందు ఉందని, మనసు పెట్టి పని చేశాము కాబట్టే, ముందు ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ కృషికి అదే నిదర్శమనన్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి గ్రామదర్శినిపై గురువారం నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ తలసరి ఆదాయం జాతీయ సగటుకన్నా 25 శాతం ఎక్కువని, 60 శాతం అక్వా దిగుబడులు ఏపీ నుంచేనని గుర్తు చేశారు. అన్ని రకాల పండ్లు పండేదీ ఏపీలోనే అని, పండ్ల ఉత్పత్తిలో ఏపీ అగ్రగామిగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమ ఊరు అన్ని ఊళ్ల కంటే బాగుందని, పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించగలమని, అంకిత భావంతో పని చేస్తే, అద్భుత ఫలితాలు వస్తాయన్నారు.
జనవరి నాటికి ప్రజల్లో సంతృప్తి శాతం 90కి చేరాలని అధికారులను ఆదేశించారు. గ్రామ దర్శిని తరువాత ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి శాతం 72 నుంచి 77 శాతానికి పెరిగిందన్నారు. దీనిని జనవరి నాటికి 90 శాతానికి తీసుకువెళ్లాలన్నారు. తిత్లీ తుపాను సహాయక చర్యల తొలిరోజు ఇబ్బంది పడ్డామని, తరువాత అందరూ అద్భుతంగా పని చేశారన్నారు. 25 రోజుల్లో పరిహారంతో సహా అంతా చక్కదిద్దామని గుర్తు చేశారు. కేంద్రం నుంచి బాధితులకు సహాయం లేదని, అయినా రాష్ట్ర వనరులతోనే ఆదుకున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయం కన్నా కృష్ణా జిల్లా తలసరి ఆదాయం రెట్టింపు ఉందన్నారు. సారవంతమైన భూములు, పొడవైన తీరప్రాంతం వంటి వనరులు ఉన్నా, శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో తలసరి ఆదాయం రెట్టింపు కావాలని స్పష్టం చేశారు. అధికారులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజల భాగస్వామ్యం పెరిగిందన్నారు. 10,169 గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారని, మిగిలినవి కూడా వెంటనే సిద్ధం చేయాలన్నారు. 5674 విద్యార్థులతో మల్టీ డిసిప్లినరీ టీమ్‌లను ఏర్పాటు చేసి, వాటిని సక్రమంగా సద్వినియోగం చేయాలన్నారు. ప్రగతి వివరాలను గోడ రాతలతో వివరించాలని, చేసిన అభివృద్ధి ప్రజలకు కనబడాలన్నారు. తమ గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగిందా? ఈ పరిస్థితిలో మరింత చేయూత ఇవ్వాలనే భావన ప్రవాస గ్రామీణులు, ప్రవాస ఆంధ్రుల్లో రావాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రగతి చర్చలు రచ్చబండల వద్ద జరగాలన్నారు. ప్రజలతో అనుసంధానమే ప్రజాస్వామ్య గొప్పతనమన్నారు. మనం ఒక స్ఫూర్తిదాయక సమయంలో ఉన్నామని, బృంద స్ఫూర్తితో పని చేస్తే, విజయాలు సాధించగలమన్నారు. రాష్ట్ర ప్రగతి బాటలో ముందు ఉందని, కానీ దేశంలో అశాంతి, అభద్రత నెలకొన్నాయన్నారు. పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెంచేశారని, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. సీబీఐ, ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని దెబ్బ తీశారన్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపునకే ఐటి, ఈడీలను వాడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని పాలకుల్లో అసహనం పెరిగిందని, ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. బాధ్యతగల పౌరులుగా అందరూ స్పందించాలన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రం ముందు ఉందన్నారు. పట్టుదల, చిత్తశుద్ధి, అంకిత భావంతో సాధించామని, మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అందుకు గ్రామదర్శిని గొప్ప వేదిక అన్నారు. గ్రామదర్శినిలో అధికారుల పనితీరును సీఎం విశే్లషించారరు. ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వివరించారు. ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్‌లు లేని సమయంలో ప్రత్యేకాధికారులపై ఎంతో బాధ్యత ఉందన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్సులో ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, ఆర్టీజీ ఎండి అహ్మద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.