రాష్ట్రీయం

చంద్రబాబు వద్ద ‘తెలంగాణ’ పంచాయతీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలంగాణ ఎన్నికల్లో టీటీడీపీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాకపోవడంతో ఈ వ్యవహారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు గురువారం కలిశారు. మహాకూటమిలో సీట్ల కేటాయింపు వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో పార్టీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో జాప్యం జరుగుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఓటమే ధ్యేయంగా వివిధ పార్టీలు మహాకూటమిగా ఏర్పడటం తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీ కూడా ఈ మహా కూటమిలో ఉండటంతో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. వివిధ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చాలా సేపు చర్చ జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఎక్కువ చర్చ జరిగినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ స్థానం బదులుగా ఖైరతాబాద్ సీటు కేటాయిస్తామనండంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీకి పట్టుఉన్న జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం స్థానాలపై పట్టుబట్టాలని నిర్ణయించారు. కాగా, నియోజకవర్గాల పునర్విభజనలో ఖైరతాబాద్‌ను విడదీసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటు చేశారు. 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధనరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నేత మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఆ తరువాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరగా, ప్రస్తుతం ఆ పార్టీ నుంచే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ సీటు కోసం కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీటు తమకు కేటాయించాలని టీటీడీపీ కోరుతోంది. దీంతో ఈ సీటు వ్యవహారం టీడీపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించక ముందు 20 సీట్లు అడగాలని సీఎంను తెలంగాణ నేతలు కోరారు. గతంలో గెలిచిన సీట్లు అన్ని టీడీపీకే కేటాయించేలా ఒత్తిడి తేవాలని సూచించారు. సీట్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నేత హనుమంతరావు, ఎల్బీనగర్ నేత సామా రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నేత భీంరెడ్డి కూడా సీఎంను కలిశారు. ఈ సీట్లు టీడీపీకే కేటాయించేలా చూడాలని కోరారు. కాంగ్రెస్ కేటాయించిన సీట్లు, కోరుతున్న సీట్లు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై మరింతగా చర్చించేందుకు వీలుగా చంద్రబాబు వెంట బెంళూరుకు టీటీడీపీ నేతలు రమణ, రావుల కూడా వెళ్లారు.

చిత్రం..టీటీపీ అధినేత చంద్రబాబును కలుసుకున్న తెలంగాణ పార్టీ నేతలు