రాష్ట్రీయం

మహిళలు నైటీలు ధరించడం నిషేధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడమర్రు, నవంబర్ 8: మహిళలు రాత్రి వేళల్లో ధరించే నైటీలపై కుల పెద్దలు నిషేధం విధించడం పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లిలో వివాదాస్పదమయ్యింది. మహిళల నుండి వ్యక్తమైన అభ్యంతరాలతో రెవెన్యూ, పోలీసు అధికారులు రంగంలోకి దిగి, అటువంటి నిషేధమేదీ లేదని తేల్చిచెప్పారు. వివరాలిలావున్నాయి... పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. ఇటీవల మహిళలు ధరించే నైటీలపై నిషేధం విధిస్తూ గ్రామపెద్దలు తీర్మానించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. ఈ అదేశాన్ని ధిక్కరిస్తే ఊరి నుండి వెలివేస్తామని, నైటీలు ధరించిన మహిళలను చూపించే వారికి రూ. 1,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ నిషేధంపై గ్రామానికి చెందిన మహిళలు అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలో నిషేధ సమాచారం అందుకున్న నిడమర్రు తహసిల్దార్ సుందరరాజు, ఎస్సై విజయ్‌కుమార్ తమ సిబ్బందితో గురువారం గ్రామంలో విచారణ జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నైటీలపై నిషేధం ఏమీ లేదన్నారు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే, బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు.