రాష్ట్రీయం

కపిలవాయికి కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 8: ప్రముఖ కవి, సాహితీవేత్త, శతాధిక గ్రంథకర్త కపిలవాయి లింగమూర్తి (90) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య గురువారం జరిగాయ. అభిమానులు, పలువురు ప్రజాప్రతినిధుల తెలంగాణలోని నాగర్‌కర్నూల్ హిందూ శ్మశానవాటికకు తరలివచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం కన్నుమూయగా, అదేరోజు రాత్రి నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఆయన స్వగృహానికి పార్థివదేహాన్ని తరలించారు. బుధవారం పార్థివదేహాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర సంగీత, నాట్య అకాడమి చైర్మన్ బద్మి శివకుమార్ సందర్శించారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రులు నాగం జనార్ధన్‌రెడ్డి, పి. రాములు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, కవి గొరటివెంకన్న, బీజేపీ అభ్యర్థి దిలీపాచారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి ధర్మరాజుతోపాటు పలువురు ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్ రాఘవచారి, తెలంగాణ మహిళా అధ్యాయన వేదిక కన్వీనర్ విమల, వివిధ రంగాలకు చెందిన రమేష్‌బాబు, వనటప్ల సుబ్బయ్య, దినకర్‌రావు, పాండు, భాస్కర్‌రావు, బిల్లకంటి వేంకటేశ్వరరావు, వెంకటేశ్వరశర్మ, రంగాచార్యులు, భూదాన్ సుబ్బారావు, రుక్మారెడ్డి, తదితరులు ఉన్నారు. కపిలవాయి అంతిమయాత్ర సందర్భంగా తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి కొద్దిదూరం పాడేమోసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. హిందూ శ్మశాన వాటికలో ఆయన చిన్న కుమారుడు అశోక్‌బాబు ఆయన చితికి నిప్పంటించారు.