రాష్ట్రీయం

లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు ఈ నెల 11న బీ-్ఫరాలను అందజేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు అభ్యర్థులకు బీ-్ఫరాలను ఇస్తారు. అలాగే అభ్యర్థులతో పార్టీ అధినేత కే. చంద్రశేఖరరావు ముఖాముఖిగా సమావేశమవుతారు. ప్రచార సరళి, ఎన్నికల వ్యూహం, ఎలక్షన్ మేనేజిమెంట్ తదితర అంశాలపై అభ్యర్థులకు కేసీఆర్ దిశ నిర్దేశం చేయనున్నారు. మొదటి విడతలో 105 మంది అభ్యర్థులను, రెండో విడతలో ఇద్దరు అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 119 నియోజకవర్గాలకుగాను 107 మంది అభ్యర్థులను టీఆర్‌ఎస్ ఖరారు చేసింది. మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇంకా ప్రకటించని నియోజకవర్గాలను మినహాయించి ఖరారైన 107 మంది అభ్యర్థులను ఈ నెల 11న తెలంగాణ భవన్‌కు రావాల్సిందిగా పార్టీ అధిష్ఠానం అభ్యర్థులకు వర్తమానం పంపించింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఇప్పటికే పార్టీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులను ప్రతీ నియోజకవర్గానికి నియమించింది. వీరి పర్యవేక్షణలోనే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరించి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అలాగే ఎన్నికల కోడ్‌కు ఉల్లంఘనలకు తావులేకుండా ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అభ్యర్థులకు దిశ నిర్దేశం చేయనున్నారు. అలాగే అభ్యర్థుల ప్రకటన తర్వాత నియోజకవర్గాల వారీగా వారం వారం పార్టీ తెప్పించుకున్న సర్వే నివేదికల్లో వెల్లడైన సానుకూల, ప్రతికూల అంశాలను అధినేత కేసీఆర్ అభ్యర్థులకు వివరిస్తారు. ప్రచారంలో వెనుకబడిన అభ్యర్థులు ఇక మీదట తీసుకోవాల్సిన చర్యలపై కూడా దిశ నిర్దేశం చేస్తారు.

గజ్వేల్‌లో కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ఈ నెల 11న సమావేశం కానున్నారని టీఆర్‌ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించే ఈ సమావేశానికి 15 వేల మంది కార్యకర్తలకు ఆహ్వానం అందింది. పార్టీ కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సమావేశం కావడం ఇదే తొలిసారి. గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ విజయాన్ని ప్రతిష్టాకరంగా తీసుకొని భారీ మేజార్టీని సాధించే వ్యూహంతో ముందుకెళ్లాలని కార్యకర్తలకు కేసీఆర్ దిశ నిర్దేశం చేయనున్నారు.