రాష్ట్రీయం

బాబు కొలువులో పరూక్, శ్రావణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 10: కేబినెట్ విస్తరణ కసరత్తు ఎట్టకేలకు పూర్తయింది. ఖాళీగా ఉన్న రెండు స్థానాల భర్తీ మినహా ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని మంత్రిత్వశాఖల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో శాఖల వారీ మార్పుల అంశానికి సంబంధించి శనివారం ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. కొత్త మంత్రులుగా శాసనమండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు కిడారి శ్రావణ్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉండవల్లిలో జరిగే మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హాజరవుతారు. ఫరూక్‌ను కేబినెట్‌లో చేర్చుకున్న నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌గా మైనారిటీ వర్గానికే చెందిన షరీఫ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు మైనారిటీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఫరూక్, షరీఫ్‌తో పాటు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం జియావుద్ధీన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ తదితరులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు చర్చించారు. ఇచ్చిన మాట ప్రకారం మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. అందరికీ పదవులు అసాధ్యమని పార్టీకి కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని జలీల్‌ఖాన్, చాంద్‌బాషాలను బుజ్జగించినట్లు తెలుస్తోంది. జలీల్‌ఖాన్‌కు ఇప్పటికే వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ప్రాధాన్యత కల్పించామని
చాంద్‌బాషాకు మరో అవకాశం ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు భరోసా కల్పించారు. సమావేశం అనంతరం జలీల్‌ఖాన్ మాట్లాడుతూ తాను పదవుల కోసం పాకులాడటంలేదని, మైనారిటీల హక్కులు, ప్రయోజనాలే ముఖ్యమన్నారు. టీడీపీ హయాంలో మైనారిటీలకు భద్రత, ప్రాధాన్యత ఉంటుందనే నమ్మకం తమకు ఉందన్నారు. చాంద్‌బాషా మాట్లాడుతూ వైసీపీ నుంచి వచ్చినందున పదవీ కేటాయింపులో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారని, అధినేత ఆదేశానుసారం పార్టీ కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలను కూడగట్టే క్రమంలో తెలంగాణలో ఎంఐఎం పార్టీతో సంప్రదింపులు జరపాలని మైనారిటీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. తెలంగాణలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు ఉన్న సంబంధాలు వివరించడం ద్వారా ఎంఐఎంను కూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తమంత్రులలో ఫరూక్ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వారు కావటంతో పాటు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కొలువులో చక్కెర, వక్ఫ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. కాగా కిడారి శ్రావణ్ రాజకీయాలకు కొత్త. తండ్రి హత్య అనంతరం పార్టీపరంగా మంత్రి పదవి దక్కింది. కిడారి, సివేరి ఆశయాలకు అనుగుణంగా పార్టీకి అంకితభావంతో పనిచేయాలని, చిన్న వయస్సులోనే మంత్రిగా గుర్తింపు తీసుకువస్తున్నామని ప్రజలకు అందుబాటులో ఉండి తోటి మంత్రులతో సమన్వయంగా మెలగాలని ఈ సందర్భంగా శ్రావణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్‌కు చెందిన షరీఫ్ శాసనమండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన వృత్తిరీత్యా వ్యాపారవేత్త కావటంతో పాటు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తగా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ముస్లిం నేతల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

చిత్రం..ముస్లిం నేతల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు