తెలంగాణ

పంజా విసిరిన చిరుతపులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్/కొల్చారం, డిసెంబర్ 1: మెదక్ డివిజన్ కొల్చారం మండలం తుక్కాపురం గ్రామంలోకి మంగళవారం ఉద యం ఓ చిరుత చొరబడి ఏడు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ రేపింది. ఏడుగురిపై పంజా విసిరింది. అధికారులు వలపన్ని 7 గంటలు నానాబీభత్సం సృష్టించిన చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి వల తో పట్టుకున్నారు. చిరుతను పట్టుకుని జూపార్క్‌కు తరలించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే...ఉదయానే్న గ్రామం లో చొరబడ్డ చిరుత గ్రామంలోని మంగం శంకర య్య, యాదయ్య, మల్లేశం, సిద్దమ్మ, శ్రీశైలం, రాములు, పోచయ్యలపై చిరుత దాడిచేయడంతో వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెద క్ ఏరియా ఆస్పత్రి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కోరంటి ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామస్థులు ఒక్కరు కూడా ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా వుండగా, చిరుతపులి దాడిలో గాయపడి మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని జిల్లా వన్యప్రాణుల అటవీ శాఖ డిఎఫ్‌ఓ జోషి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చిరుతపులి దాడిలో గాయపడిన వారికి ప్రభుత్వపరంగా చికిత్స చేయిస్తామని తెలిపారు. క్షత గాత్రుల విషయం గురించి వన్యప్రాణుల సంరక్షణ చీఫ్ వైల్డ్ ఆఫీసర్‌కు సంఘటన విషయాన్ని తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. చిరుతపులి దాడి లో తీవ్రంగా గాయపడిన వారిలో బుజ్జి, పోచయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు మెదక్ ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ పిసి. శేఖర్ తెలిపారు. అదే విధంగా క్షతగాత్రు లకు ఆర్థిక సహాయం అందేవిధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆర్డీఓ మెంచు నగేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాన్ని భీతావహులను చేసి పలువురిని గాయపరిచి తప్పించుకుపోయన చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికా రులు బంధించారన్నారు.

గ్రామస్థులు, అధికారులు చిరుతను పట్టుకున్న దృశ్యం