రాష్ట్రీయం

‘గజ’గజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నానికి తుపానుగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. తుపానుకు ‘గజ’ అని నామకరణం చేశారు. ఈ తుపాను ఆదివారం సాయంత్రానికి తమిళనాడుకు తూర్పు ఈశాన్య దిశగా 840 కిమీ దూరంలోను, నాగపట్నం నుంచి 880 కిమీ దూరంలోను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా మరింత బలపడి తీవ్ర తుపానుగా వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ, అనంతరం స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ దిశగా కదులుతూ తదుపరి 48 గంటల్లో బలహీన పడుతుందన్నారు. నెమ్మదిగా తమిళనాడు తీరానికి చేరుకుని నాగపట్నం - చెన్నై మధ్య ఈ నెల 15వ తేదీన తీరం దాటుతుందని పేర్కొన్నారు. ‘గజ’ తుపాను ప్రభావం ఎక్కువగా తమిళనాడుపై ఉంటుందని, దక్షిణ కోస్తాలో కూడా స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. అయితే తీరం వెంబడి గాలులు
బలంగా వీస్తాయన్నారు. ఆదివారం నుంచి తీరం వెంబడి ఈశాన్య దిశ నుంచి గంటకు 35 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ఇదే సందర్భంలో సముద్రం కాస్త కల్లోలంగా ఉంటుందని తెలిపారు. తదుపరి 48 గంటల్లో గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని, గంటకు 65 నుంచి 75 కిమీ గరిష్ట వేగంతో గాలులు వీస్తాయన్నారు. సముద్రం కూడా మరింత అలజడిగా ఉంటుందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకువెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని హెచ్చరించారు.