రాష్ట్రీయం

ప్రతిఓటూ మనకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 11: రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా అంకితభావంతో కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త మంత్రులకు సూచించారు. ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో ఆదివారం మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఫరూక్ అనుభవమున్న నేత కాగా, శ్రావణ్‌కు తొలిసారిగా అవకాశం ఇచ్చామన్నారు. ముస్లిం వర్గాలకు మంత్రి పదవితో పాటు ఫరూక్ వల్ల ఏర్పడిన ఖాళీని అదే మైనారిటీ వర్గానికి చెందిన షరీఫ్‌తో భర్తీ చేశామన్నారు. మంత్రి పదవిని ఆశిస్తున్న కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాకు శాసనసభ విప్‌గా కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తమ పార్టీలో తగిన ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హతమార్చటం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. కిడారి తనయుడు శ్రావణ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించామని, రెండో కుమారుడు సందీప్‌ను గ్రూప్-1 అధికారిగా నియమిస్తామని, కుమార్తె వైద్యవిద్యకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామని చంద్రబాబు
ప్రకటించారు. ఇప్పటికే విశాఖలో కిడారి, సివేరి కుటుంబాలకు ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వం, పార్టీ పరంగా కుటుంబంలో ఒక్కొక్కరికీ రూ.5లక్షల నుంచి 10లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించామని తెలిపారు. సివేరి తనయుడు అబ్రహాంను ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన కిడారి సతీమణి పరమేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే బాధ్యత పార్టీ స్వీకరిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మైనారిటీల అభ్యున్నతికి మంత్రి ఫరూక్ అహరహం శ్రమించాలని కోరారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో అనుభవమున్న నేపథ్యంలో అందరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. కాగా ఐఐటీతో ఐఏఎస్ అధికారి కావాల్సిన కిడారి శ్రావణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గిరిజన సంక్షేమానికి అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సహచర ప్రజానీకం ఆర్థిక, రాజకీయ, సామాజిక ఎదుగుదలకు తోడ్పడాలన్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఏ ఒక్క ఓటూ చేజారకూడదని నిర్దేశించారు.
ప్రతిష్ట పెంచుతాం: ఫరూక్, శ్రావణ్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం మైనారిటీ, గిరిజన సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలుచేస్తూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేస్తామని మంత్రులు ఫరూక్, శ్రావణ్ చెప్పారు. తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామన్నారు. కార్యకర్తలు, నాయకులకు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి శ్రావణ్ పాదాభివందనం చేశారు.

చిత్రం..కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు