రాష్ట్రీయం

మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నా.. మీరే కాపాడుకోండి..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా భర్త వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయా.. ఇప్పుడు కుమారుడ్నీ దూరం చేయకండి.. పొట్టమీద కొట్టకండి అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. 17 రోజుల విరామం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం విజయనగరం నుంచి మళ్లీ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి ప్రాణాలు ఇవ్వడమే తెలుసని.. అబద్దాలు చెప్పడం.. నాటకాలు ఆడటం తెలియదని అన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్న జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని ఆమె తెలిపారు. ప్రజల కోసం, జగన్ క్షేమం కోసం ప్రార్థనలు చేయగలను.. కానీ జగన్‌ను ప్రజలే కాపాడుకోవాలని అన్నారు. జగన్ పాదయాత్రకు బయలుదేరుతున్నందున ప్రజలకు కృతజ్ఞతలు, విన్నపాన్ని తెలిపేందుకే మీడియా ముందుకు వచ్చానని ఆమె తెలిపారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్న రాష్ట్ర ప్రజలకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందన్నారు. రాజశేఖర్ రెడ్డిని, తమ కుటుంబాన్ని ప్రేమించి, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నానని ఆమె అన్నారు.
జగన్‌కు ఇది పునర్జన్మ
జగన్‌కు ఇది పునర్జన్మ అని.. గొంతులో దిగాల్సిన కత్తి భుజంపై దిగిందని అన్నారు. ప్రజల ప్రేమ, ఆశీస్సులతోనే జగన్ ప్రాణాపాయం నుంచి
బయటపడ్డారని అన్నారు. కానీ టీడీపీ నాయకులు చిన్నకత్తే కదా? ఇంత రాద్ధాంతం అవసరమా? అని అంటున్నారని.. అదే కత్తి గొంతులో దిగివుంటే ఎంత ప్రమాదం జరిగేదో మీరే ఊహించాలని అన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని ఒక పెద్ద మనిషి అన్నప్పుడు తాను దేవుణ్ణి మాత్రమే ప్రార్థించానని ఆమె తెలిపారు. గోదావరి జిల్లాలో కూడా అంతం చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లు తెలిసిందన్నారు. అక్కడ కుదరకపోవడంతో విమానాశ్రయాన్ని ఎంచుకున్నారని అన్నారు. విమానాశ్రయంలో జన సందడి ఉండదు కాబట్టి అక్కడ హత్యాప్రయత్నం చేశారని ఆమె తెలిపారు. ప్రతిపక్ష నేతకు విమానాశ్రయంలోనే భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. భద్రత పెంచాల్సిందిగా తమ పార్టీ నాయకులు కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు.
విచారణ జరగాలి
కత్తితో దాడి చేసిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మీరు ఫిర్యాదు చేయకుండా.. విచారణ సక్రమంగా జరగడం లేదంటే ఎలా అని ప్రశ్నించగా, ఏపీ పోలీసులపై నమ్మకం లేకకాదు.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేనందుకే ఫిర్యాదు చేయలేదన్నారు. ఏపీ పోలీసులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మకం ఉంటే కేంద్ర పోలీసుల జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారని విజయమ్మ ప్రశ్నించారు. కత్తితో దాడి చేసిన యువకుడు జగన్ అభిమానే అంటూ ఫ్లెక్సీలు సృష్టించింది ఎవరని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ అభిమానే అయితే ఎన్నో సార్లు జగన్ విమానాశ్రయానికి వచ్చినప్పుడు దాడి చేయని యువకుడు ఇప్పుడే ఎందుకు చేశాడని ఆమె ప్రశ్నించారు. పైగా విమానాశ్రయంలోకి సూది, నెయిల్ కట్టర్‌ను కూడా అనుమతించనప్పుడు కత్తి లోపలికి ఎలా తీసుకెళ్ళగలిగాడని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డిని ప్రజలు 30 ఏళ్ళు ఆదరించారని.. నాన్న తనను ఒంటరి చేయలేదని ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని రాష్ట్ర ప్రజలనుద్దేశించి జగన్ అంటుంటారని విజయమ్మ చెప్పారు.
జగన్ ఎలా ఉన్నారు? అని ప్రశ్నించగా, పూర్తిగా కోలుకున్నారని, అయితే చేతులు పైకెత్తి నమస్కారం చేయరాదని డాక్టర్లు సూచించారని విజయమ్మ సమాధానమిచ్చారు.

చిత్రం..హైదరాబాద్‌లో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ