రాష్ట్రీయం

మళ్లీ మనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11:‘మళ్లీ మనదే ప్రభుత్వం. వంద సీట్లు గ్యారంటీ. తాజా సర్వేలోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. ఇంకో మూడు వారాలు కష్టపడండి. జాగ్రత్తగా నామినేషన్లు వేయండి. కోడ్ ఉల్లంఘనలు జరగక్కుండా పార్టీ లీగల్ సెల్ సహాయం తీసుకోండి. ఎంత మాత్రం అతి విశ్వాసం, నిర్లక్ష్యం వహించకండి’ అని పార్టీ అభ్యర్థులకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో నాంపల్లి మినహా 106 మందికి పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా బీ-్ఫరాలు అందజేశారు. మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేసిన నాంపల్లి నియోజకవర్గానికి కూడా పార్టీ అభ్యర్థిగా ఆనంద్‌గౌడ్‌ను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎంఐఎం అభ్యంతరంతో నాంపల్లి అభ్యర్థి ఒక్కరికే బీ-ఫారాన్ని ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. ఇలా ఉండగా రెండున్నర గంటల పాటు అభ్యర్థులతో అధినేత కేసీఆర్ ముఖాముఖిగా మాట్లాడారు. ముఖ్యంగా ఎన్నికలకు మరో మూడు వారాల వ్యవదే ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని, మరో మూడు వారాల పాటు కష్టపడితే చాలని కేసీఆర్ సూచించారు. నామినేషన్లను పార్టీ నియమించిన లీగల్ సెల్ న్యాయవాదుల సహకారం తీసుకొని జాగ్రత్తగా దాఖలు చేయాలని, కోడ్ ఉల్లంఘనకు తావులేకుండా ప్రచారంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఇప్పటి వరకు పరిస్థితి టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా అనుకూలంగా ఉంది. తిరిగి తామే అధికారంలోకి వస్తున్నామన్నారు. తాజా సర్వే నివేదికల ప్రకారం రోజు రోజుకు టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయవకాశాలు మరింత మెరుగు పడ్డాయన్నారు. ఓ మూడు, నాలుగు చోట్ల మాత్రమే ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొబోతున్నట్టు తాజాగా సమాచారం అందిందన్నారు. ఈ నియోజకవర్గాల పట్ల పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఇంచార్జీలను ఏర్పాటు చేస్తుందన్నారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం మొదట కొంత ఇబ్బంది కలిగించినా ఈ వ్యూహం బాగా కలిసి వచ్చినట్టు అనుభవపూర్వకంగా స్పష్టమైందన్నారు. ‘మనం బీ-ఫారాలు ఇచ్చే వరకు కూడా కూటమి పొత్తులు తెగలేదు. అభ్యర్థులను ప్రకటించకలేకపోయింది. పైగా అక్కడ సీట్ల కేటాయింపు గొడవ, అభ్యర్ధుల ఖరారు రచ్చరచ్చగా మారడంతో టీఆర్‌ఎస్ విజయవకాశాలు మరింత మెరుగు పడినట్టు తాజా సర్వే నివేదికల్లో వెల్లడైంది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
నాంపల్లి అభ్యర్థికి బీ-ఫారం ఇవ్వకపోవడానికి...
పార్టీ ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో ఒకే ఒక నాంపల్లి అభ్యర్థికి మినహా మిగతా వారందరికి టీఆర్‌ఎస్ బీ-ఫారాలను అందజేసింది. వాస్తవానికి మిత్రపక్షం ఎంఐఎంకు సిట్టింగ్ స్థానమైన నాంపల్లికి టీఆర్‌ఎస్ డమీ అభ్యర్థిగా ఆనంద్‌గౌడ్‌ను ప్రకటించింది. అయితే అక్కడ ఎంఐఎం, కాంగ్రెస్ అభ్యర్థి ఇరువురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఒక్కరే మెజార్టీ జనాభా కలిగిన సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఇక్కడ ఎంఐఎం అభ్యర్థికి ఇబ్బందికరంగా మారినట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. దీంతో నాంపల్లిలో డమీ అభ్యర్థిని కూడా బరిలోకి దించవద్దని ఎంఐఎం టీఆర్‌ఎస్‌ను కోరింది. ఇలాంటి పరిస్థితే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎదుర్కొంటుంది. అక్కడ టీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఉన్నప్పటికీ ఎంఐఎం పార్టీ బరిలోకి అభ్యర్థిని దించనున్నట్టు ప్రకటించింది. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇచ్చిపుచ్చుకునే దోరణితో వ్యవహరించాలని టీఆర్‌ఎస్, ఎంఐఎం ఇరుపార్టీలు భావిస్తున్నాయి. ఈ అంశంపై టీఆర్‌ఎస్ అధిష్ఠానంతో సోమవారం చర్చలు జరుపనున్నట్టు సమాచారం. దీంతో నాంపల్లి అభ్యర్థి ఆనంద్‌గౌడ్‌కు బీ-్ఫరం ఇవ్వకుండా ఆపింది. సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో విధిగా సమావేశమై, బీ-్ఫరం ఇచ్చేదీ లేనిదీ సోమవారం తేలుతుందని, అప్పటి వరకు ఆగాలని సూచించినట్టు తెలిసింది. ఇదే కారణంగా నాంపల్లి అభ్యర్థికి బీ-్ఫరం ఇవ్వలేదని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.
ఇలా ఉండగా ఇంకా ప్రకటించని 12 స్థానాలకు అభ్యర్థులపై సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ 12 స్థానాల్లో ఒకటైన ముషీరాబాద్ టికెట్‌ను తనకుగానీ, తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి గానీ ఇవ్వాలనీ అభ్యర్థుల సమావేశంలోనే పార్టీ అధినేత కేసీఆర్‌కు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఇంకా అభ్యర్థిని ప్రకటించని మేడ్చల్ నుంచి తిరిగి టికెట్ తనకే ఇవ్వాలని కోరడానికి తెలంగాణ భవన్‌కు వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని అభ్యర్థుల సమావేశం హాల్‌లోకి అనుమతించలేదు. ఈ నెల 14న తాను నామినేషన్ వేసిన మరుసటి రోజు 15 నుంచే హెలిక్యాప్టర్ ద్వారా ప్రచార సభలకు రానున్నట్టు సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. 70 నుంచి 80 నియోజకవర్గాల్లో తన సభలు ఉంటాయని కూడా వివరించారు. అలాగే గ్రేటర్ హైదరాబాన్ నగరానికంతటికి కలిపి డిసెంబర్ 3న భారీ సభను నిర్వహించనున్నట్టు కూడా వెల్లడించారు.
చిత్రం..తెలంగాణ భవన్‌లో ఆదివారం అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
ప్రసంగిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్‌రావు