రాష్ట్రీయం

తుది దశకు కూటమి చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: మహా (ప్రజా) కూటమి చర్చలు తుది దశకు వచ్చాయి. ముందుగా అనుకున్నట్లు టీడీపీకి 14 సీట్లు దక్కాయి. కాగా టీజేఎస్, సీపీఐకి కేటాయించే సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను వెంట తీసుకుని హుటాహుటిన టీజేఎస్ కార్యాలయానికి చేరుకుని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని నాయకులు చెబుతున్నప్పటికీ, జనగామ స్థానం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేసుకోవాలని భావించినట్లు నాయకులు చెబుతున్నారు.
టీజేఎస్ పోటీ చేసే స్థానాలు
మెదక్, దుబ్బాక, మల్కాజిగిరి, జనగామ, వర్దన్నపేట, వరంగల్ తూర్పు, సిద్దిపేట, మిర్యాలగూడ, రామగుండం. అయితే జనగామ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేస్తారని కాంగ్రెస్ నాయకులంతా భావిస్తుండగా, ఆ సీటు విషయంలో టీజేఎస్ పట్టుపట్టింది. దీంతో కాంగ్రెస్ ఒక షరతు విధించినట్లు సమాచారం. జనగామ నుంచి ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేస్తేనే ఆ సీటు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.
స్నేహపూర్వక పోటీలు
ఇలాఉండగా అసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్, టీజేఎస్ అభ్యర్థులు తమ పార్టీ గుర్తులతో స్నేహపూర్వక పోటీ చేయనున్నారు.
సీపీఐ పోటీ చేసే స్థానాలు..
ఇలాఉండగా సీపీఐకి హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి స్థానాలు కేటాయించగా, ఆ పార్టీ కొత్తగూడెం, మునుగోడు స్థానాల్లో కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కంగుతిన్నది. వెంటనే ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డితో కలిసి సీపీఐ కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో మంతనాలు జరిపారు. కాగా తమకు ఐదు స్థానాలు కావాల్సిందేనని సీపీఐ నేతలు భీష్మించుకుని కూర్చున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సోమవారం ఉదయం మరోసారి ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీజేఎస్, సీపీఐ నేతలతో చర్చించనున్నారు.
నోటిఫికేషన్‌కు ముందే..
ఇలాఉండగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చర్చల్లో ఇబ్బందులు ఏమీ లేవని, కూటమిగానే పోటీ చేస్తామన్నారు. ఇప్పుడు పోటీ చేసేందుకు అవకాశం దక్కని పార్టీ నాయకులకు అధికారంలోకి రాగానే సరైన గుర్తింపునిస్తామని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ జారీ కావడానికి ముందే ఏ పార్టీ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందో వెల్లడిస్తామని ఉత్తమ్ చెప్పారు.

చిత్రం..టీజేఎస్ కార్యాలయంలో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో కోదండరామ్, రమణ తదితరులు