రాష్ట్రీయం

ఉద్యోగుల ధర్మాగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ స్టీరింగ్ కమిటీ (జేఏసి) హెచ్చరించింది. కొత్తగా ఏర్పడ్డ జేఏసీ ఆదివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దాదాపు 82 సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు. నాలుగున్నర ఏళ్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని జేఏసి నేతలు చెలగాని సంపత్ కుమార స్వామి, బి. భజంగరావు, చావా రవి, బాషబత్తిని రాజేశం, టి. శుభాకర్‌రావు, కే. గోపాల్‌రెడ్డి తదితరులు ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పటైన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి. వాస్తవంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల జేఏసి ఒకటి ఇప్పటికే ఉంది. ఈ జేఏసి సమర్థతగా పనిచేయడం లేదన్న కారణంతో కొత్త జేఏసీని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో చేసిన తీర్మానాలు ఇవీ..
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) ను రద్దు చేసి, పాత పిన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి. ఐఆర్‌గా 43 శాతం ప్రకటించాలి. పీఆర్‌సీ నివేదికను త్వరగా తెప్పించుకుని అమలు చేయాలి. 2014 జూన్ 2 వరకు సర్వీసులో ఉన్న ఉద్యోగులకు, పింఛనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసును అమలు చేయాలి. ఈలోగా యాజమాన్యాల వారీగా పదోన్నతులు ఇవ్వాలి. భాషా పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ ఇవ్వాలి. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ స్థానికత ఉన్న ఉపాధ్యాయులను వారి కోరికమేకు ఏపీకి బదిలీ చేయాలి. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వారి కోరికమేరకు తెలంగాణకు రప్పించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి, వైద్యులను, మందులను అందుబాటులో ఉంచాలి. ఈహెచ్‌ఎస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ
సంస్థలు తదితరులకు నగదురహిత వైద్యాన్ని అందించాలి. 10 వ పీఆర్‌సీ ప్రకారం 70 ఏళ్లు నిండిన పింఛనర్లకు 15 శాతం అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను ఇవ్వాలి. ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబ సభ్యుడిని పది రోజుల్లోగా కారుణ్య నియామకం చేయాలి. ఎస్‌సీ, ఎస్‌టి ఉద్యోగులకు ఉన్నత విద్యకు ఆన్‌డ్యూటీగా అవకాశం ఇవ్వాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 శాతం ఇంటి అద్దె అలవెన్స్ ఇవ్వాలి. భార్యాభర్తలైన ఉద్యోగులను వీలైనంత దగ్గరగా పోస్టింగ్ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, ఇళ్లు లేని పింఛనర్లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి. ఎయిడెడ్ విద్యాసంస్థలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఖాళీలను భర్తీ చేయాలి. మాడల్ స్కూల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి. సీసీఏ రూల్స్‌ను సరళతరం చేయాలి. తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్ట్ఫా కౌన్సిల్‌ను, డిపార్ట్‌మెంటల్ జాయింట్ స్ట్ఫా కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేసేందుకు న్యాయపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలి. గురుకులాలన్నింటికీ కలిపి కామన్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి. ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలి.

చిత్రం..హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అభివాదం చేస్తున్న ఉద్యోగుల జేఏసీ నాయకులు