రాష్ట్రీయం

పేదరికంపై పైచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: పేదరికంపై గెలుపు ద్వారా ఒకేరోజు 2 లక్షల మంది లబ్ధిదారులకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనిముట్లను అందించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పేదరికంపై గెలుపు (ఆదరణ-2) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్లలో రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. ఆదరణ-2 పథకం కింద లక్ష మంది చేతివృత్తుల లబ్ధిదారులకు, వివిధ కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ పథకాలను లక్ష మందికి అందిస్తున్నామన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాలంటే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో నాలుగు దశల్లో మొత్తం 4 లక్షల మంది లబ్దిదారులకు ఈ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన కులాలలో వారసత్వంగా కులవృత్తులు, చేతివృత్తులు చేస్తారని, వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనిముట్లు అందించడం వల్ల వారి ఆదాయం రెట్టింపై ఆర్థిక స్థిరత్వం చేకూరడంతో పాటు వారు చేసే పనిని సులువుగా చేసే వీలు ఏర్పడిందన్నారు. అదే విధంగా ఎస్సీ కులాలలో భూములు లేని పేదవారు ఉన్నారని వీరిని ఆదుకోవడానికి భూమి కొనుగోలు పథకంతో ఆర్థిక స్థిరత్వం పెరిగే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తూనే వెయ్యి కోట్ల రూపాయలతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రానికి పంపించామన్నారు. మైనారిటీలకు చేయూతను ఇచ్చేందుకు ఏపీజే అబ్దుల్ కలాంను రాష్టప్రతిగా ప్రోత్సహించామన్నారు. ఆయన జయంతి రోజు ప్రతిభా పురస్కరాలు అందిస్తున్నామన్నారు. ఒక్కరోజే మైనారిటీ
వర్గానికి చెందిన ఎండీ ఫరూక్‌కు మంత్రి పదవి, చాంద్‌బాషాకు ప్రభుత్వ విప్, షరీఫ్‌కు మండలి చైర్మన్ పదవి ఇవ్వడం ముస్లింలపై తమ అభిమానానికి నిదర్శనమన్నారు. మా ప్రభుత్వం పేదల పక్షపాతి అని వారి కోసం ఏమి చేయటానికైనా అండగా ఉంటూ చేయూతను అందిస్తామన్నారు. రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల కులాలు 50శాతం మంది ఉన్నారని, వీరిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆధునిక పనిముట్లతో వీరు తయారు చేసే వస్తువులు పక్క రాష్ట్రాలకు సైతం అమ్మే వీలు ఏర్పడుతుందన్నారు. వెనుకబడిన కులాల్లో కల్లుగీత కార్మికులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి లాంటి వివిధ చేతి వృత్తుల వారు, కులవృత్తుల వారు ఉన్నారని, వీరి అభివృద్ధికి ఆధునిక పనిముట్లు ఇవ్వడంతో పాటు వీరి ఆదాయం పెరిగేలా ప్రభుత్వం నాణ్యతలో, ధరలో రాజీ పడకుండా పనిముట్లు అందిస్తున్నామన్నారు. ఇచ్చే పనిముట్లు నాసిరకంగా ఉంటే వాటిని మరలా తిరిగి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ పనిముట్లుకు గ్యారంటీ కూడా కల్పించామన్నారు. వెనుకబడిన తరగతుల కులాల గౌరవం పెంచే విధంగా వారికి రుణాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టి వారిని మరలా వారి ఇంటి దగ్గర బస్సుల్లో వదిలి పెడుతున్నామన్నారు. లబ్ధిదారులకు ఐవీఆర్‌ఎస్ ద్వారా ఆర్టిజీఎస్ నుంచి ఫీడ్‌బ్యాక్ కోసం ఫోన్ కాల్స్ వస్తాయని ఎక్కడైనా అవినీతి జరిగిందని తెలిస్తే వదలిపెట్టేది లేదని, మంచిని ప్రోత్సహిస్తామన్నారు. మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో మంత్రులు నక్క ఆనంద్‌బాబు, అచ్చెనాయుడు కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన ఫరూక్, శ్రావణ్‌లు ఉన్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ అయిన ఎండీ ఫరూక్‌కు మైనార్టీ శాఖతో పాటు వైద్యవిద్య, యువకుడు, ఐఐటీ వారణాసిలో చదివిన శ్రావణ్‌కుమార్‌కు గిరిజన సంక్షేమంతో పాటు ఆరోగ్యశాఖ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇచ్చి ప్రోత్సహించామన్నారు. ఆయా వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపడానికే ఈ విధంగా చేశామని చంద్రబాబు అన్నారు. ఆదరణ-2 ద్వారా లక్ష మంది చేతివృత్తి, కులవృత్తుల లబ్ధిదారులకు రూ.115 కోట్లతో, లక్షా 16 వేల మందికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1582 కోట్లతో లబ్ధిదారులకు అందించామన్నారు. మెగా గ్రౌండింగ్ మేళాను నాలుగు విడతలుగా 8 లక్షల మందికి ఇవ్వనున్నామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
సభలో పేదరికంపై గెలుపు లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 50 సంవత్సరాలు దాటిన చర్మకారులకు 6వేల మందికి 30వేల రూపాయల ఖరీదు కలిగిన టూల్‌కిట్, 20వేల రూపాయల ఆర్థికసాయం అందించే జీవోను ముఖ్యమంత్రి విడుదల చేశారు. షెడ్యూల్ కులాల ఆర్థిక సేవా సహకార సంస్థ సారధ్యంలో వస్తున్న సంక్షేమ తేజం మాసపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్, మంత్రులు అచ్చెనాయుడు, నక్కా ఆనందబాబు, ఎన్‌ఎండీ ఫరూక్, శ్రావణ్‌కుమార్, దేవినేని ఉమామహేశ్వరరావు, అమర్‌నాథ్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు, బుట్టా రేణుక, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, సమాచార పౌరసంబంధాల శాఖ కార్యదర్శి బి రామాంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ముస్లీం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రాలు.. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ఆదరణ-2 కార్యక్రమంలో సన్నాయ, శాక్సాఫోన్ ఊదుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు