రాష్ట్రీయం

జగన్ పాదయాత్ర జనసంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ: విజయనగరం జిల్లా మక్కువ మండలంలో జన సంద్రం మధ్య వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర సోమవారం మళ్లీ ప్రారంభమైంది. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడం, తదుపరి హైదరాబాద్‌లో వైద్య చికిత్స, విరామం తీసుకున్న జగన్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. మక్కువ మండలంలోని మేళాపువలస కాలనీ నుంచి ప్రజల నీరాజనాలతో జగన్ పాదయాత్రను ప్రారంభించారు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులను అప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది. మజ్జిగౌరమ్మ గుడి జంక్షన్, ములక్కాయవలస, కాశీపట్నం, పాపయ్యవలస, కొయ్యానపేట మీదుగా జగన్ పాదయాత్ర జరిగింది. మహిళలు జగన్‌ను చూసేందుకు బారులుతీరారు. వైసీపీ అధినేత జగన్ వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మండల వైసీపీ నాయకులు, మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసులనాయుడు, వైసీపీ కన్వీనర్ మావుడి రంగునాయుడు, వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, తూర్పుగోదావరి వైసీపీ నాయకులు పిల్లి సుభాష్‌చంద్రబోసు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, వైసీపీ నాయకులు జగన్ వెంట నడిచారు. మక్కువ గ్రామంలోని కుమ్మరి కులస్థులు వారి వృత్తికి సంబంధించిన చక్రాన్ని ఏర్పాటుచేయగా దానిని జగన్ తిప్పారు. కుల వృత్తిద్వారా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, మా సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు స్పందించి వైసీపీ ప్రభుత్వం రాగానే మీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వృద్ధులు, వికలాంగులు జగన్ కలిసి తమకు సక్రమంగా
పింఛన్లు రావడం లేదని, కొంతమంది నిరుద్యోగులు కూడా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించగా వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెస్తానన్నారు. యువత జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీస్ సిబ్బంది ఎవరినీ దగ్గరకు రానివ్వకపోవడంతోపాటు కొంతమేర తోపులాట జరగడంతో నిరాశకు గురయ్యారు. మధ్యాహ్నం కాశీపట్నం వద్ద జగన్ భోజనం విరామం తీసుకున్న అనంతరం మళ్లీ బయలుదేరి పాపయ్యవలస, కొయ్యానపేట, కంచేడువలస మీదుగా వెంకటభైరిపురం వరకు పాదయాత్ర కొనసాగింది.
చిత్రం..పాదయాత్రలో వైఎస్ జగన్ వెంట ఉత్సాహంగా నడుస్తున్న వృద్ధురాలు