రాష్ట్రీయం

చెన్నైకి చేరువలో ‘గజ’ కేంద్రీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 12: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుపాను క్రమంగా బలపడుతోంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పున 760 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గజ తుపాను తీవ్ర తుపానుగా మారి పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని, పంబన్-కడలూరు మధ్య 15వతేదీ ఉదయం తీరం దాటుతుందని పేర్కొన్నారు. గజ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాపై ఉంటుందని, 14వ తేదీ నుంచి తీరం వెంబడి ఈశాన్య దిశ నుంచి 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు. 14వ తేదీ సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రధాన పోర్టుల్లోనూ రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

చిత్రం..తుపాను హెచ్చరికలతో చెన్నైలో ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారుల పడవలు