ఆంధ్రప్రదేశ్‌

రైతుకు భారం దించుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 25: రాష్ట్రంలో రుణ విష వలయంలో చిక్కుకున్న రైతాంగాన్ని వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం ప్రస్తుతం అమలవుతోందని, అయితే రైతులను పూర్తిగా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో రూ.1.5 లక్షల రుణం ఉన్న రైతులు 92శాతం ఉండగా, రూ.1.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు రుణం ఉన్న రైతులు ఎనిమిది శాతం ఉన్నారన్నారు. వీరికి వన్‌టైం సెటిల్‌మెంట్ విధానాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, దీనికి సంబంధించి సోమవారం విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. ఒకటిన్నర లక్షల రూపాయల లోపు రుణం ఉన్న రైతులకు అయా బ్రాంచి మేనేజర్ల పరిధిలోనూ, పదిలక్షల రూపాయల లోపు రుణాలున్న రైతులకు అయా బ్యాంకుల ప్రాంతీయ మేనేజర్ల పరిధిలోనూ వన్‌టైం సెటిల్‌మెంట్ వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి ఇప్పటికే ఆంధ్రాబ్యాంకు ఆమోదించిందని, మిగిలిన బ్యాంకుల ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. సోమవారం మరోసారి బ్యాంకు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించిన మీదట విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. రైతులను రుణ విముక్తుల్ని చేయటం తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఈమూ పక్షుల పెంపకాన్ని చేపట్టిన రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈవిషయంలోనూ బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈవిషయమై కూడా బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నామని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో పాటు బ్యాంకులు కూడా పెద్ద మనస్సుతో ఆలోచించి ఈము ఫామ్‌ల కోసం రుణాలు పొందిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పామాయిల్ రైతులకు గతంలో టన్నుకు 0.45శాతం ప్రోత్సాహకం అందించామని, దీని ద్వారా టన్నుకు రూ.140 అదనంగా అందాయన్నారు. ఈసారి బడ్జెట్‌లో రూ.50 కోట్లు దీనికోసం కేటాయించామన్నారు. ఈవిడత రెండు శాతం అంటే దాదాపు రూ.600 నుంచి రూ.800 వరకు ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించామన్నారు.