రాష్ట్రీయం

డమీల్లో పరమ డమీలు వేరయా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: డమీల్లో పర డమీలు వేరయా! అని మున్ముందు పాడుకోవాల్సిన పరిస్థితి నగరంలోని నాంపల్లి నియోజకవర్గంలో నెలకొంది. మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి టీఆర్‌ఎస్ ఎంత దాసోహం అయిందో నాంపల్లి అభ్యర్థి ఉదంతం తార్కాణంగా మారింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో నాంపల్లి అభ్యర్థి మునుకుంట్ల ఆనంద్‌గౌడ్ ఒకరు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జాంబాగ్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మునుకుంట్ల ఆనంద్‌గౌడ్ కేవలం ఐదు ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న జాంబాగ్ డివిజన్‌లోనే టీఆర్‌ఎస్ సత్తా చాటిన ఆనంద్‌గౌడ్‌ను ఈ సారి ఎన్నికల్లో నాంపల్లి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే మిత్రపక్షం ఎంఐఎంకు ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌నే ఎంపిక చేసింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజుఖాన్‌కు టిక్కెట్ దాదాపు ఖరారు అయింది. ఎంఐఎం నుంచి జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ నుంచి జాఫర్ హుస్సేన్ బరిలో ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆనంద్‌గౌడ్ ఒక్కరే మెజారిటీ జనాభా కలిగిన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి విజయానికి గడ్డుపరిస్థితి ఏర్పడింది. స్నేహపూర్వక పోటీలో తమ అభ్యర్థి సులువుగా గెలిచేలా డమీ అభ్యర్థిని బరిలోకి దించమంటే కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు ముచ్చెమటలు పట్టించిన ఆనంద్‌గౌడ్‌ను అభ్యర్థిగా నిలబెడతారా? అని ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ప్రకటించిన 107 మందిలో 106 మంది అభ్యర్థులకు బీ-్ఫమ్‌లు ఇచ్చి ఆనంద్‌గౌడ్‌కు నిరాకరించింది. ఎంఐఎం సూచన మేరకు గట్టి డమీ అభ్యర్థి ఆనంద్‌గౌడ్ కాకుండా పరమ డమీ అభ్యర్థి కోసం రెండు రోజులుగా టీఆర్‌ఎస్ గాలించింది. చివరకు ఇదే పేరు కలిగి ఇంటి పేరు మాత్రం వేరుగా ఉన్న సీహెచ్ ఆనంద్‌గౌడ్ అనే కార్యకర్తను వెతికి పట్టుకుని నాంపల్లి నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఎం ఆనంద్‌గౌడ్ స్థానంలో సీహెచ్ ఆనంద్‌గౌడ్‌కు బీ-్ఫమ్‌ను ఇవ్వనుంది.

చిత్రం..నాంపల్లి నుంచి డమీ అభ్యర్థిగా ప్రకటించి ఆ తర్వాత బీ-్ఫమ్ నిరాకరించిన
మునుకుంట్ల ఆనంద్‌గౌడ్