రాష్ట్రీయం

తెలంగాణ భవన్‌కూ నిరసనల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఆఫీసు గాంధీభవన్‌కే పరిమితమైన అసమ్మతి సెగ టీఆర్‌ఎస్ ఆఫీసు తెలంగాణ భవనకూ పాకింది. టిక్కెట్ల దక్కని నేతలు గాంధీభవన్ వద్ద గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుతున్నారు. తాజాగా అధికార టీఆర్‌ఎస్‌కు అసమ్మతి సెగ పాకింది. ఖైరతాబాద్ టిక్కెట్ మాజీ మంత్రి దానం నాగేందర్‌కు ఇవ్వవద్దంటూ టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ మనె్న గోవర్దన్‌రెడ్డి అనుచరులు సోమవారం తెలంగాణ భవన్ వద్ద ధర్నాకు దిగారు. టీఆర్‌ఎస్ పెండింగ్‌లో పెట్టిన 12 స్థానాల్లో ఖైరతాబాద్ కూడా ఉంది. ఇక్కడి నుంచి నియోజకవర్గ ఇంచార్జీ, గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మనె్న గోవర్దన్‌రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ టిక్కెట్ తనకే వస్తుందన్న సంకేతంతో దానం నాగేందర్ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే టీఆర్‌ఎస్ నాయకత్వం దానం నాగేందర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లనే ఆయన ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం బయటికి పొక్కడంతో సెగ పుట్టింది. అంతే గోవర్దన్‌రెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. అయితే అభ్యర్థిని ఖరారు చేయకుండానే ధర్నా చేయడంలో అర్థం లేదని తెలంగాణ భవన్ వర్గాలు మనె్న అనుచరులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఇటీవలే పార్టీలో దానంకు టిక్కెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ గోవర్దన్‌రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. ఓ పక్క కేసీఆర్, కేటీఆర్ జిందాబాద్ అంటూనే, మధ్యలో దానం నాగేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దానంకు టిక్కెట్ ఇస్తే రెబల్ అభ్యర్థిగా గోవర్దన్‌రెడ్డి బరిలోకి దిగడం ఖాయమని ఆయన అనుచరులు హెచ్చరించారు. అలాగే నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ఆ నియోజకవర్గ ఇంచార్జీ శంకరమ్మ (ఉద్యమంలో అమరుడు శ్రీకాంతాచారి తల్లి) హెచ్చరించారు. హుజూర్‌నగర్ నుంచి తనకు టికెట్ ఇవ్వకుండా మంత్రి జగదీశ్‌రెడ్డి కుట్రపన్నారని ఆమె ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డికి టిక్కెట్ ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పేలా జగదీశ్‌రెడ్డి ఒప్పందం చేసుకున్నారని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనకు న్యాయం చేస్తారన్న పూర్తి నమ్మకం ఉందని, అయితే జగదీశ్‌రెడ్డి మాట విని టికెట్ ఇవ్వకపోతే మాత్రం ప్రాణత్యాగానికి వెనుకాడనని ఆమె హెచ్చరించారు. ఈ తాజా పరిణమాలు పెండింగ్‌లో ఉన్న 12 టీఆర్‌ఎస్ స్థానాలపై తీవ్రంగానే ఉండేలా ఉంది. ఒక విధంగా టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి తల నొప్పిగా చెప్పవచ్చు. ఈ స్థానాల నుంచి ముగ్గురు, నలుగురు ఆశావాహులు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టిక్కెట్ ప్రకటించినా మిగిలిన వారు రెబల్స్ అయ్యేలా ఉన్నారు. పెండింగ్ స్థానాలలో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్‌తో పాటు మనె్న గోవర్దన్, దివంగత పీజేఆర్ కూతురు విజయారెడ్డి, ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి టిక్కెట్ ఆశిస్తున్నారు. ముషీరాబాద్ నుంచి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ముఠా గోపాల్, అంబర్‌పేట నుంచి కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రి కృష్ణాయాదవ్, సుధాకర్‌రెడ్డి, గోషామాహల్ టికెట్‌ను ప్రేమ్‌సింగ్‌రాథోడ్, నందకిశోర్ వ్యాస్, మల్కాజ్‌గిరి నుంచి ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతి, హుజూర్‌నగర్ నుంచి ఎన్‌ఆర్‌ఐలు సైదిరెడ్డి, అప్పిరెడ్డి, శంకరమ్మ, కోదాడ నుంచి చందర్‌రావు, శశిధర్‌రెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. ఈ స్థానాలకు కూటమి తరఫున అభ్యర్ధులను ప్రకటించాకే అభ్యర్థులను ఖరారు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ స్థానాలకు అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం వల్ల అసమ్మతి సెగ నుంచి సులువుగా బయటపడవచ్చని కూడా పార్టీ అంచనా వేస్తోంది.
తెలంగాణ భవన్ వద్ద ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ నేత మనె్న గోవర్ధన్‌రెడ్డి అనుచరుల హల్‌చల్.. మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ