రాష్ట్రీయం

రహదార్ల అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జాతీయ, రాష్ట్ర రహదార్ల విస్తరణ, మరమ్మతులు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలాఖరులోగా రహదార్లపై ఉన్న గోతులను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హైవేల నిర్మాణం, విస్తరణ నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా పర్యవేక్షించాలన్నారు. భూ సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించుకుని నేషనల్ హైవే అథారిటీ అధికారులతో రోడ్డు, రవాణా అధికారులు సమన్వయం చేసుకుని పనుల్లో వేగం పెంచాలన్నారు. మంజూరైన పనుల నిర్వహణలో కాంట్రాక్టర్ల ఖరారు సాకుతో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. అమరావతి- అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక నడవ పరిధిలో రహదార్ల అభివృద్ధి, 16, 65వ నెంబర్ జాతీయ రహదారుల విస్తరణ, కనకదుర్గమ్మ, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ప్రధానకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ రహదారి పనులను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ 30వేల కోట్ల మేర వివిధ రహదార్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. వాటిలో రాష్ట్ర హైవేలకు సంబంధించి రూ 7,477 కోట్లకు గాను 733 పనులు మంజూరు చేయగా 40 శాతం పూర్తయ్యాయని చెప్పారు. వివిధ జాతీయ, రాష్ట్ర రహదార్లకు సంబంధించి భూ సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎస్‌కు వివరించారు. విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో 6 రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. అమరావతి- అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను 384 కిలోమీటర్ల పరిధిలో నిర్మించేందుకు కేంద్రం నుంచి అనుమతి రాగా రహదార్ల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌లు ఏపీ మండల కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ వంతెనలు, రోడ్ల రీ కనెక్టివిటీ ప్రాజెక్ట్ (ఏపీఆర్‌బీఆర్‌పీ)ను రూ 3వేల 200 కోట్లతో చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు నీరబ్‌కుమార్‌ప్రసాద్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ కింద జిల్లా, మండల కేంద్రంలో రహదార్లను అనుసంధానించటంతో పాటు కొత్త వంతెనల నిర్మాణం, పాత వంతెనల పునర్నిర్మాణం చేపడతామన్నారు. నెలాఖరులోగా గోతులులేని పాట్‌హోల్ రహదారులుగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ రిజ్వీ, నళినీ మోహన్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విజయవాడ ప్రాంతీయ అధికారి అనిల్‌దీక్షిత్, కేంద్ర రోడ్డు రవాణా, హైవే సంస్థ ప్రతినిధి ఎస్‌కె సింగ్, ఆర్ అండ్ బీ ఈఎన్‌సీలు వై రాజీవ్‌రెడ్డి, ఎం సుబ్బారావు, పలువురు సీఈఒలు పాల్గొన్నారు.